Home న్యూస్ హౌస్ ఫుల్స్ తో ఓపెన్ అయిన గబ్బర్ సింగ్…రికార్డుల ఊచకోత ఖాయం ఇవాళ!!

హౌస్ ఫుల్స్ తో ఓపెన్ అయిన గబ్బర్ సింగ్…రికార్డుల ఊచకోత ఖాయం ఇవాళ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ…వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా, సెప్టెంబర్1 న కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్ షోలు వేయగా అల్టిమేట్ ట్రెండ్ ను…

లిమిటెడ్ గానే షోలు వేయగా ఓవరాల్ గా ప్రీమియర్స్ కి ఇండియాలో 50 లక్షలకు పైగా బుకింగ్స్ జరిగాయి…ఇక సెప్టెంబర్2 న పవర్ స్టార్ బర్త్ డే జోరులో భారీ లెవల్ లో షోలు పడటం చాలా చోట్లా హౌస్ ఫుల్ బోర్డులతో సినిమా ఓపెన్ అవ్వడం విశేషం…

రీసెంట్ టైంలో నైజాంలోనే చాలా వరకు సినిమాలు ఎక్కువ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా గబ్బర్ సింగ్ మాత్రం ఆంధ్ర సీడెడ్ లలో సెన్సేషనల్ జోరు చూపించి మాస్ రచ్చ చేసింది…ఓవరాల్ గా సెప్టెంబర్2 న తెలుగు రాష్ట్రాల ఫైనల్ బుకింగ్స్ 3.6 కోట్ల మార్క్ ని అందుకోగా…

టోటల్ ఇండియా బుకింగ్స్ తో కలిపి సినిమా 4 కోట్ల మార్క్ ని దాటింది…ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్క మరో రేంజ్ లో ఉండగా రికార్డ్ లెవల్ బుకింగ్స్, హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయిన గబ్బర్ సింగ్ సినిమా కి భారీ వర్షాల ఎదురుదెబ్బ ఉన్నా కూడా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో మాస్ రచ్చ చేయడంతో…

ఓవరాల్ గా రీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో సినిమా రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా వర్షాలు కొంచం తక్కువ ఇబ్బంది పెడితే రికార్డుల మార్జిన్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here