Home న్యూస్ 280 కోట్ల భీభత్సం….ఆ టాక్ ఏంటి…ఈ కొట్టుడు ఏంటి!!

280 కోట్ల భీభత్సం….ఆ టాక్ ఏంటి…ఈ కొట్టుడు ఏంటి!!

0

రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేదు…రిలీజ్ అయిన తర్వాత ఒక్కో చోట ఒక్కో రకమైన టాక్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా ఇక తేరుకునే అవకాశం లేదని అందరూ అనుకున్నారు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా…

లాంగ్ వీకెండ్ లో ఊహకందని కలెక్షన్స్ తో మాస్ జాతర సృష్టించింది ఇప్పుడు….మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను అందుకోలేక పోయినా కూడా, విజయ్ కి సెన్సేషనల్ మార్కెట్ ఉండే కేరళలో కూడా ఏమాత్రం ఇంపాక్ట్ లేక పోయినా కూడా…

తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో రిమార్కబుల్ హోల్డ్ తో లాంగ్ వీకెండ్ లో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా మొత్తం మీద 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 224 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుండగా…

తమిళనాడులో సెన్సేషనల్ కలెక్షన్స్ తో మరోసారి 24 కోట్ల రేంజ్ కి పైగా కలెక్షన్స్ ని అందుకోబోతుండగా….కర్ణాటక, కేరళలో 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో 3.5 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

టోటల్ గా ఓవర్సీస్ లో సినిమా 4వ రోజు ఇప్పుడు 20-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు 4వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా…

55-58 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతో టోటల్ గా 4 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 280 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతున్న ఈ సినిమా…

ఆడియన్స్ లో ఉన్న టాక్ కి ఏమాత్రం సంభందం లేని రేంజ్ కలెక్షన్స్ ఊచకోత కోస్తూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఈ రేంజ్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తో అందుకోబోతున్న సినిమా విజయ్ మాస్ స్టార్ డం పవర్ ఏ రేంజ్ లో ఉందో అన్నదానికి నిదర్శనంగా నిలిచింది అని చెప్పొచ్చు.

The Greatest Of All Time 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here