Home న్యూస్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే…కాచుకోండి ఇక!!

ఎన్టీఆర్ దేవర ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే…కాచుకోండి ఇక!!

0

ఈ ఇయర్ టాలీవుడ్ లో ఆడియన్స్ ను అలరించి హిట్స్ గా నిలిచిన సినిమాలు తక్కువే…కల్కి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న మరో బిగ్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1)…యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబో లో వస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు..

సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలను పెంచడానికి అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా మీద ఉన్న హైప్ ను…

ఈ ట్రైలర్ మరో లెవల్ కి తీసుకువెళుతుంది అని అందరూ నమ్ముతున్నారు. ఇక సినిమా ట్రైలర్ టాలీవుడ్ పరంగా బ్రేక్ చేయాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి. ట్రైలర్స్ విషయంలో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను ఎక్కువగా చూస్తారు…ఇది వరకు సలార్ ట్రైలర్ 3 నిమిషాల్లో…

ఈ రికార్డ్ ను అందుకోగా తర్వాత ప్లేస్ లో భీమ్లా నాయక్ 4 నిమిషాల గ్యాప్ లో ఈ రికార్డ్ ను అందుకుని టాప్ 2 ప్లేసులలో నిలిచాయి. ఇక వ్యూస్ పరంగా 24 గంటల్లో గుంటూరు కారం ట్రైలర్ 37.68 మిలియన్ వ్యూస్ తో టాప్ లో సలార్ ట్రైలర్ 32.58 మిలియన్ వ్యూస్ ని అందుకుని టాప్ 2 లో నిలిచాయి…

ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ 1.24 మిలియన్ లైక్స్ ని అందుకోగా తర్వాత సలార్ ట్రైలర్ 1.238 మిలియన్ లైక్స్ ను అందుకుని టాప్ 2 ప్లేసులను దక్కించుకున్నాయి. ఓవరాల్ దేవర ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన మేజర్ రికార్డులు ఇవి…

మొత్తం మీద సినిమా మీద ఉన్న హైప్ కి ట్రైలర్ కట్ బాగుంటే మంచి రీచ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా, రికార్డులను ఈ ట్రైలర్ అందుకుంటే సినిమా మీద ఉన్న క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళే ఛాన్స్ ఎంతైనా ఉంటుంది. ఇక ట్రైలర్ ఈ రికార్డులలో ఎన్ని బ్రేక్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here