Home న్యూస్ అక్కడ ఓపెన్ గ్రౌండ్….ఆ ఒక్కటి వస్తే…ఇక ఆపడం కష్టమే!

అక్కడ ఓపెన్ గ్రౌండ్….ఆ ఒక్కటి వస్తే…ఇక ఆపడం కష్టమే!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ ఎలాంటి పోటి లేకుండా గ్రాండ్ రిలీజ్…

అలాగే దసరా వరకు మంచి రన్ ఉండే అవకాశం ఉంది, కర్ణాటకలో కూడా సినిమా సాలిడ్ జోరు చూపించవచ్చు, ఇక తమిళ్ మరియు మలయాళంలో టాక్ ను బట్టి సినిమా ఫేట్ డిసైడ్ అయ్యి ఉంటుంది, అదే టైంలో మేకర్స్ మొదటి నుండి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న…

బాలీవుడ్ లో కనుక సినిమా వర్కౌట్ అయితే మిగిలిన చోట్ల కలెక్షన్స్ ని ఈ ఒక్క చోటే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, ఇప్పుడు ఆ అవకాశం మరింత పెరిగేలా సినిమాకి అక్కడ ఎలాంటి పోటి లేకుండా 2 వారాల ఫ్రీ రన్ దొరకబోతుంది. పాన్ ఇండియా మూవీస్ కి…

ఇలాంటి ఫ్రీ 2 వీక్స్ రన్ హిందీ లో దొరకడం అంటే మామూలు విషయం కాదు, అందులో కూడా రిలీజ్ వీక్ తో పాటు అక్టోబర్ 2 న నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ ను బాలీవుడ్ వాళ్ళు రీసెంట్ టైంలో వదిలిపెట్టింది లేదు, కానీ ఈ సారి ఎన్టీఆర్ కి ఆ వీకెండ్ మొత్తాన్ని రాసి ఇచ్చేసినట్లే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదు…

ముందు అక్టోబర్ 2 న రిలీజ్ అనుకున్న అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా అక్షయ్ ప్రజెంట్ ఫామ్ వలన పోస్ట్ పోన్ అయింది, ఇక అదే డేట్ కి వస్తుంది అనుకున్న ఆలియా భట్ జిగ్రా, మరియు రాజ్ కుమార్ రావ్ ల విక్కీ విద్య కా వో వీడియో మూవీ కూడా ఇప్పుడు అక్టోబర్ 11 న దసరా కానుకగా…

రిలీజ్ కాబోతూ ఉండటంతో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 11 వరకు హిందీలో దేవర సినిమాకి ఫుల్ ఫ్రీ రన్ సొంతం కాబోతుంది…రీసెంట్ బ్లాక్ బస్టర్ స్త్రీ2 హవా అప్పటికి స్లో అయిపోతుంది కాబట్టి దేవర ఆడియన్స్ మొదటి ఛాయిస్ కానుంది హిందీ లో. ఈ అడ్వాంటేజ్ కి తోడూ సినిమా కి టాక్ బాగా వస్తే హిందీలో సంచలనాలు సృష్టించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here