Home న్యూస్ విశ్వం 4 డేస్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో దెబ్బ!!

విశ్వం 4 డేస్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో దెబ్బ!!

0
Gopichand Viswam Movie 4 Days Total WW collections
Gopichand Viswam Movie 4 Days Total WW collections

బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్న స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) సినిమా ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో అలరించ లేక పోయింది. మొదటి వీకెండ్ లో దసరా పండగ అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా…

డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అనిపించే టార్గెట్ ను అందుకోవాలి అనుకున్నా కూడా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ తర్వాత 4వ రోజు వర్కింగ్ డే లో మొత్తం మీద పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకుంది ఇప్పుడు…

మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 58 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 62 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించిన సినిమా 1.2 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజులు పూర్తి అయ్యే టైంకి…

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Viswam 4 Days Collections Report
👉Nizam: 1.43CR~
👉Total Andhra: 2.45Cr
AP-TG Total:- 3.88CR(6.95CR~ Gross)
👉KA+ROI+OS: 52L~
Total WW Collections: 4.40CR~(8.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 5.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here