Home గాసిప్స్ దేవర ఇచ్చిన ధైర్యం…చుక్కల్లో పుష్ప2 రేటు!!

దేవర ఇచ్చిన ధైర్యం…చుక్కల్లో పుష్ప2 రేటు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara part 1) మాస్ రాంపెజ్ తెలుగు రాష్ట్రాల్లో మాస్ సెంటర్స్ లో ఉన్న థియేటర్స్ యజమానులకు తిరిగి ధైర్యం ఇచ్చింది… ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో…

మాస్ సెంటర్స్ లో దేవర రన్ మరో లెవల్ లో సాగగా 30 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించడం విశేషం…దేవర సృష్టించిన కలెక్షన్స్ సునామీ తో అప్ కమింగ్ మూవీస్ కి ఇక్కడ మంచి రేటు పెట్టి కొనడానికి బయర్స్ మళ్ళీ ఆసక్తి చూపిస్తూ ఉండగా…

త్వరలోనే ఆడియన్స్ ముందుకు అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2 రూల్(Pushpa2 The Rule Movie) కి ఊహకందని రేంజ్ లో…

Devara Movie 15 Days Total World Wide Collections!!

బిజినెస్ ఆఫర్స్ అన్ని చోట్లా వస్తూ ఉండగా ఇప్పుడు రాయలసీమ ఏరియాలో సినిమాకి మమ్మోత్ 30 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్ వచ్చిందని సమాచారం. టాలీవుడ్ చరిత్రలో సీడెడ్ లో కేవలం 3 సినిమాలు మాత్రమే 30 కోట్లకు పైగా షేర్ ని రాయలసీమ లో అందుకుని దుమ్ము లేపగా…

ఇప్పుడు ఆ షేర్ మార్క్ పుష్ప2 కి బిజినెస్ గా మారబోతుంది. దేవర లానే పుష్ప2 కి కూడా డిసెంబర్ మొత్తం పోటి తక్కువగానే ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ బిజినెస్ రికవరీ అవుతుందని బయర్స్ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్ మోస్ట్ ఇదే రేటు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేవర లానే పుష్ప2 కూడా ఇక్కడ ఎలాంటి ఊచకోత కోస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here