బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దీపావళికి భారీ అంచనాల నడుమ కోలివుడ్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న సినిమా శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో రూపొందిన రియల్ స్టోరీ మీద తెరకెక్కిన అమరన్(Amaran Movie Business) గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.
సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత తమిళ్ లో ఎక్స్ లెంట్ గా బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో కూడా డీసెంట్ క్రేజ్ నడుమ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇక తెలుగు లో సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్లకు పైగా ఉంటుందని అంచనా…
సినిమా తెలుగులో భారీగానే రిలీజ్ కానుండగా తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక తమిళ్ లో అలాగే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు బిజినెస్ పరంగా….
కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ మార్క్ ని అందుకుందని అంచనా…ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా వరల్డ్ వైడ్ గా మినిమమ్ 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
సినిమా మీద ఉన్న క్రేజ్ దృశ్యా ఈ కలెక్షన్స్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదనే చెప్పాలి. తమిళ్ లో ఎక్స్ లెంట్ బజ్ నడుమ రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగు లో కూడా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.