బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తికేయ2 లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ ను 18 పేజెస్ లాంటి డీసెంట్ మూవీ తర్వాత నిఖిల్ బిగ్ బడ్జెట్ మూవీస్ చేస్తూ ఉండగా ఈ గ్యాప్ లో ఎవ్వరూ ఊహించని విధంగా నిఖిల్ నటించిన ఓల్డ్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న…
ఈ సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ కార్ రేసర్ అవ్వాలి అనుకునే హీరోకి డబ్బు చాలా అవసరం అవుతుంది, డబ్బు కోసం హీరోయిన్స్ లో లవ్ లో పడతాడు..కానీ అనుకోకుండా అనేక ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం పర్వాలేదు అనిపించేలా స్టార్ట్ అయినా కూడా తర్వాత కథ కొంచం ఫ్లాట్ గానే సాగినట్లు అనిపించగా, కొన్ని సీన్స్ తప్పితే చాలా వరకు కథ సింక్ అవ్వలేదు అనిపించగా…ఎలాగోలా ఇంటర్వెల్ ఎపిసోడ్ కొంచం పర్వాలేదు అనిపించగా…
సెకెండ్ ఆఫ్ లో అసలు కథ ఉంటుంది అనుకోగా సెకెండ్ ఆఫ్ కథ కూడా చాలా వరకు ఫ్లాట్ గానే సాగి మేజర్ ట్విస్ట్ ఒక్కటి తప్పితే మిగిలిన కథ మొత్తం స్లో నరేషన్ తోనే సాగింది అనిపించింది… మొత్తం మీద నిఖిల్ తన రోల్ వరకు బాగానే చేశాడు కానీ….
సినిమాలో అంతగా ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఏమి లేవని అనిపించింది. మొత్తం మీద ఫస్టాఫ్ బిలో యావరేజ్ టు యావరేజ్ లెవల్ లో సెకెండ్ ఆఫ్ బిలో యావరేజ్ లెవల్ లో అనిపించింది అన్న టాక్ అయితే ప్రీమియర్స్ అయ్యాక సినిమాకి వచ్చింది….
ఓవరాల్ గా ప్రీమియర్స్ అయ్యే టైంకి సినిమాకి ఆడియన్స్ నుండి బిలో యావరేజ్ టు యావరేజ్ రేంజ్ లో టాక్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.