Home న్యూస్ 121 కోట్ల హీరో….పాన్ ఇండియా మూవీ…ఒక్క ఫైట్ కోసం ఇన్ని కోట్లా!!

121 కోట్ల హీరో….పాన్ ఇండియా మూవీ…ఒక్క ఫైట్ కోసం ఇన్ని కోట్లా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్న హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha)…కార్తికేయ2(Karthikeya2 Movie) తో సంచలన విజయాన్ని అందుకుని పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ను అందుకోగా టోటల్ రన్ లో ఆల్ మోస్ట్ 121 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది.

ఆ సినిమా తర్వాత పెండింగ్ లో ఉన్న 18 పేజెస్ తో మరో సక్సెస్ ను అందుకున్న నిఖిల్ ఇప్పుడు తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తున్న సెన్సేషనల్ మూవీ “స్వయంభు”(Swayambhu Movie) చేస్తూ ఉండగా సినిమా మీద మంచి బజ్ అయితే ఉందని చెప్పాలి. కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న నిఖిల్ ఈ సినిమా కోసం…

స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోగా సినిమా షూటింగ్ ఇప్పుడు యమ జోరుగా సాగుతూ ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రూపొందబోతుంది….కాగా సినిమాలో ఒక భారీ యాక్షన్ ని షూటింగ్ చేస్తున్నారట…700 మంది ఆర్టిస్టులతో ఆల్ మోస్ట్ 12 రోజుల పాటు భారీ ఎత్తున ఈ ఎపిక్ యాక్షన్ సీన్ ని చిత్రీకరించబోతున్నారట….

ఆల్ మోస్ట్ ఈ యాక్షన్ సీన్ కోసం ఇప్పుడు 8 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్నారట…ఈ రేంజ్ బడ్జెట్ ఒక్క యాక్షన్ సీన్ కోసమే పెట్టడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. భారీ అంచనాల నాడున రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లోనే వచ్చే అవకాశం ఉంది…

కార్తికేయ2 తో పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ సక్సెస్ ను అందుకుని తన మార్కెట్ ను పెంచుకున్న నిఖిల్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకుని తన రేంజ్ ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా నిఖిల్ కి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here