కోలివుడ్ నుండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సెన్సేషనల్ మూవీ అయిన స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన కంగువ(Kanguva Movie) మూవీ, భారీ అంచనాల నడుమ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమాకి..
చివరి నిమిషంలో నైజాంలో సరైన రిలీజ్ ను డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేసే విషయంలో అంచనాలను అందుకోవడం లేదు, అదే టైంలో తమిళ్ లో కూడా అగ్రిమెంట్స్ అనుకున్న రేంజ్ లో జరగడం లేదు..ఈ రెండు చోట్ల సమస్య ఎంత ఫాస్ట్ గా సద్దుకుంటే సినిమాకి అంత మంచింది..
ఇక ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి సినిమాకి ఇండియా లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 10.5 కోట్ల మార్క్ ని దాటేసింది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ 4 కోట్ల మార్క్ ని అందుకుంది…దాంతో గ్రాండ్ రిలీజ్ ఉండబోతున్నా కూడా కంగువ మూవీకి ఇప్పుడు మౌత్ టాక్…
చాలా ముఖ్యం అనే చెప్పాలి. టాక్ బాగుంటేనే షో షోకి కలెక్షన్స్ పరంగా జోరు చూపించే అవకాశం ఉంది. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే తమిళనాడులో మొదటి రోజు 10-12 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…
తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి ఇబ్బందులు రావడంతో అన్నీ అనుకున్నట్లు జరిగి టాక్ బాగుంటే 8-10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. ఇక కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ పర్వాలేదు అనిపించేలానే ఉండగా…
ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది…ఇప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మట్టుకు సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 55-60 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు మించుతుందో చూడాలి.