ఈ ఇయర్ కన్నడ ఇండస్ట్రీను భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన లిమిటెడ్ మూవీస్ లో ధృవ్ సార్జా(Dhruva Sarja) నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్(Martin Movie) మూవీ ఒకటి….ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చాలా డిలే అయ్యి ఎట్టకేలకు థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత…
ఆడియన్స్ నుండి ఎక్స్ ట్రీమ్ లెవల్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది…ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ రన్ అతి కష్టం మీద కంప్లీట్ చేసుకున్న తర్వాత…
రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది… అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా వీడియోలలో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇక్కడ నుండి సినిమాకి ఇప్పుడు ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా ఓటిటి రెస్పాన్స్ మాత్రం…
మరింత దారుణంగా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా చూసిన ఆడియన్స్ అసలు ఏం కథ ఉందని ఈ సినిమా తీశారు, ప్రతీ సీన్ ఓవర్ ది టాప్ అనిపించేలా హీరో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండటం, డైలాగ్స్ కూడా క్రింజ్ లెవల్ లో ఉండటం, లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్…
ఇలా ప్రతీ సీన్ క్రింజ్ ఫెస్ట్ లా అనిపించింది సినిమాలో అని అంటున్నారు…ఒక్క యాక్షన్ సీన్స్ కొంచం పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా దారుణంగా ఉందని అంటున్నారు. సినిమా ఎండ్ దాకా చూసిన ఆడియన్స్ ని మెచ్చుకోవాల్సిందే అంటూ కూడా…
సోషల్ మీడియాలో సినిమా మీద కామెంట్స్ వినిపిస్తూ ఉండగా మొత్తం మీద సినిమాకి డిజిటల్ లో థియేటర్స్ కి మించిన రేంజ్ లో నెగటివ్ టాక్ వినిపిస్తుంది…మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచిన మార్టిన్ మూవీ ఇప్పుడు డిజిటల్ లో అంతకుమించిన డిసాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.