Home న్యూస్ దేవరతో పోటికి సిద్ధం అయిన కన్నడ క్రేజీ పాన్ ఇండియా మూవీ….ఏమవుతుందో ఇక!

దేవరతో పోటికి సిద్ధం అయిన కన్నడ క్రేజీ పాన్ ఇండియా మూవీ….ఏమవుతుందో ఇక!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరాకి పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రేజీ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1 Movie)….సాలిడ్ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ…

ఎలక్షన్స్ అండ్ షూటింగ్ డిలే వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు దసరాకి రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. రిలీజ్ ప్రీ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటూ ఉన్నా ప్రస్తుతానికి మేకర్స్ దసరానే టార్గెట్ చేసి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ టైంలో దేవర వస్తుంది అని తెలిసి పెద్దగా పోటి ఏమి లేకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా సినిమాలు రిలీజ్ లు కన్ఫాం అవ్వలేదు…

దాంతో దసరాకి దేవరకి అన్నీ అనుకున్నట్లు జరిగితే అన్ని ఇండస్ట్రీలలో బిగ్ రిలీజ్ కన్ఫాం అనుకున్నా కూడా ఎన్టీఆర్ కి సాలిడ్ మార్కెట్ ఉన్న పక్క రాష్ట్రం కర్నాటకలో ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ నుండి పోటి ఎదురుకాబోతుంది. ఎన్టీఆర్ దేవర ముందు ఆ సినిమా ఇతర చోట్ల పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవచ్చు కానీ కర్ణాటకలో థియేటర్స్ సమస్య అయితే ఉండే అవకాశం ఉంది.

అప్పట్లో పొగరు అనే సినిమాతో సందడి చేసిన ధృవ సర్జా(DHRUVA SARJA) తర్వాత తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో చేస్తున్న మార్టిన్(Martin Movie) ని ఎప్పుటి నుండో షూటింగ్ చేస్తూనే ఉన్నా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకేక్కుతూ ఉండగా రీసెంట్ గా సినిమాను…

అక్టోబర్ 11న దేవర రిలీజ్ తర్వాత రోజు భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు కన్ఫాం చేశారు. దాంతో ఎన్టీఆర్ కి సాలిడ్ మార్కెట్ ఉన్న కర్ణాటకలో ఈ సినిమా నుండి పోటి గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. ఆ టైంకి దేవర ప్రీ పోన్ అయితే సోలో రిలీజ్ ఉండొచ్చు కానీ దసరాకి వస్తే మిగిలిన చోట్ల ఎలా ఉన్న కర్ణాటకలో కలెక్షన్స్ కి దెబ్బ పడే అవకాశం అయితే ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here