రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మా సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా 2000 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అంటూ కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రెస్ మీట్ లో సినిమా గురించి ఓ రేంజ్ లో…
కామెంట్స్ చేశారు…..మీడియా వాళ్ళు కోలివుడ్ నుండి మొదటి 1000 కోట్ల సినిమా అయ్యేలా ఉంది కంగువ అంటూ అడిగిన ప్రశ్నకి ఈ రేంజ్ లో ఆన్సర్ ఇవ్వడంతో సినిమా మీద ఏ రేంజ్ లో నమ్మకం ఉందో నిర్మాతకి అని అందరూ అనుకున్నారు….
కానీ కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే ఎపిక్ డిసాస్టర్ అనిపించుకునే టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది…మొదటి వారంలో అతి కష్టం మీద 90 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన సినిమా ఇప్పుడు లైఫ్ టైంలో…
ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటితే అదే గొప్ప విషయం అనిపించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు…నిర్మాత 2000 కోట్లతో మొదలు పెట్టిన సినిమా ప్రమోషన్ కి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి దయనీయంగా మారిపోయింది అని చెప్పాలి…
సినిమా కోసం ఎంతో కష్టపడిన సూర్యకి ఈ సినిమా భారీగా ఎదురుదెబ్బ కొట్టినట్లు అయింది. ఏ దశలో కూడా తేరుకునే అవకాశమే లేని సినిమా 100 కోట్ల మార్క్ ని దాటినా ఎపిక్ నష్టాలనే సొంతం చేసుకుని కోలివుడ్ తరుపున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలవబోతుంది ఇప్పుడు.