బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో సత్యదేవ్(Satyadev) కూడా ఒకరు….లేటెస్ట్ గా సత్యదేవ్ తో పాటు కన్నడ యాక్టర్ డాలీ ధనంజయ తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ అయిన జీబ్రా(Zebra Movie Review in Telugu) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ..
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే బ్యాంక్ లో పనిచేసే హీరో అప్పడప్పుడు బ్యాంకింగ్ సిస్టం లో ఉండే లూప్ హోల్స్ వాడి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు, కానీ ప్రేమలో పడిన తర్వాత అవన్నీ మానేస్తాడు, కానీ అనుకోకుండా హీరోయిన్ ఒక 4 లక్షల ట్రాన్సాక్షన్ విషయంలో చేసిన తప్పు వలన…
హీరో తిరిగి లూప్ హోల్స్ వాడి డబ్బులు సంపాదించే క్రమంలో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఓవరాల్ గా కథ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ లాజిక్ లు అసలు ఏమాత్రం వెతకకుండా చూస్తెనే పర్వాలేదు బాగుంది అనిపిస్తుంది…అదే టైంలో…
లాజిక్ లు వెతకడం మొదలు పెడితే ఇంత ఈజీగా హీరో ఎలా చేశాడు అనిపించేలా ఉంటుంది, అదే టైంలో సత్యదేవ్ ఉన్నంత వరకు కూడా సినిమా బాగుంది అనిపించేలా సాగుతుంది కానీ హీరో కన్నా కూడా విలన్ అయిన డాలీ ధనంజయ కి ఎక్కువ స్క్రీన్ టైం అలాగే బ్యాక్ స్టోరీ పెట్టడం లాంటివి…
ఇతర భాషలను కవర్ చేయడానికి చేసిన పని అయినా కూడా మన వరకు మాత్రం అవి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, దాంతో సత్యదేవ్ స్క్రీన్ మీద లేని టైంలో కథ ఎటు నుండి ఎటో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది….సెకెండ్ హాల్ఫ్ లో ఇది మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది..
ఇక సత్యదేవ్ తన రోల్ వరకు బాగా చేసి మెప్పించాడు…హీరో విలన్ ల మధ్య సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. డాలీ ధనంజయ పర్వాలేదు అనిపించగా హీరోయిన్ ఓకే అనిపించింది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించాయి.
ఎడిటింగ్ ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అయిన ఫీలింగ్, ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగింది, దానికి తోడూ సినిమా కథ లో లాజిక్ లు లేకుండా వచ్చే సీన్స్ ఓవర్ ది టాప్ అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఆకట్టుకున్నా కూడా…
చెప్పే విధానంలో కొంచం తడబడ్డాడు. హీరోకి ఇవ్వాల్సిన స్కోప్ కన్నా విలన్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చినట్లు అనిపించింది, అది కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా లేక పోవడం డ్రా బ్యాక్…అయినా కూడా సత్యదేవ్ కోసం, కొన్ని ఆసక్తి కరమైన సీన్స్ కోసం, ఫస్టాఫ్ కోసం సెకెండ్ ఆఫ్ ను ఓపికతో చూస్తె…
క్లైమాక్స్ పర్వాలేదు అనిపించేలా ముగిసి ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఎండ్ అవుతుంది. కానీ ట్రైలర్ చూసి అంచనాలు కొంచం ఎక్కువ పెంచుకుంటే మట్టుకు ఆ అంచనాలను అనుకున్న రేంజ్ లో సినిమా అందుకోకపోవచ్చు… మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్….