KGF …సలార్ సిరీస్ ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) అందించిన కథతో…కన్నడ లో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్స్ లో ఒకరైన శ్రీ మురళి(Sriimurali) హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ…బఘీర(Bagheera Collections) సినిమా ఆడియన్స్ ముందుకు దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి పోటిలో వచ్చిన…
మిగిలిన సినిమాలకు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఆ సినిమాల ఇంపాక్ట్, అలాగే ఈ సినిమాకి మిక్సుడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది. సినిమా ఉన్నంతలో కర్నాటకలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా…
మొదటి వారంలో కర్ణాటకలో 17.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మిగిలిన రన్ లో ఓవరాల్ గా సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది…టోటల్ గా ఇండియాలో సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి….27 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా…
అందులో 25.5 కోట్లకు పైగా కలెక్షన్స్ కర్ణాటక నుండి రాగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా మరో 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను సాధించింది…ఇక ఓవర్సీస్ లో పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 29 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుని పరుగును పూర్తి చేసుకుంది…షేర్ అటూ ఇటూగా 15 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది సినిమా….సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 19 కోట్లకు పైగా షేర్ ని…
అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా టోటల్ రన్ లో 4 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని బిలో యావరేజ్ టు యావరేజ్ రేంజ్ లో నిలిచింది. కర్ణాటకలో మంచి రికవరీనే సాధించినా మిగిలిన చోట్ల మాత్రం సినిమా ఫ్లాఫ్ గా నిలిచింది అని చెప్పాలి.