Home న్యూస్ మాస్ భీభత్సం….రెబల్ స్టార్ సలార్ ఆగమనం కన్ఫాం!!

మాస్ భీభత్సం….రెబల్ స్టార్ సలార్ ఆగమనం కన్ఫాం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లో భారీ హైప్ ఉన్న మాస్ మూవీ సాలార్, కేజిఎఫ్ సిరిస్ తో ఆల్ ఇండియా లెవల్ లో సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ మాస్ మూవీ సలార్…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎప్పుడు రానుంది అన్నది ఇప్పుడు అఫీషియల్ గా ఇండిపెండెన్స్ డే కానుకగా అనౌన్స్ చేశారు… సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుందని కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ ఊచకోత మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రభాస్ నుండి బాహుబలి తర్వాత అందరూ కోరుకున్న మాస్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సలార్ వచ్చే ఏడాది ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here