రిలీజ్ అయిన రోజు నుండి హిందీ లో చూపిస్తున్న మాస్ రాంపెజ్ ముందు తెలుగు రాష్ట్రాల్లో చూపిస్తున్న హోల్డ్ కొంచం తక్కువగానే అనిపిస్తుంది పుష్ప2(Pushpa2 Movie) విషయంలో.. ఆ రేంజ్ లో హిందీ లో మాస్ రచ్చ చేస్తున్న పుష్ప2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ స్టడీ కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండగా…
ప్రతీ రోజూ మరీ కొత్త రికార్డులు నమోదు చేయకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో ఒకటిగా అయితే దూసుకు పోతుంది. ఈ క్రమంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో మరోసారి…
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించి ఏకంగా 1.76 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని అనుకున్న దాని కన్నా బెటర్ గా ట్రెండ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా టాప్ 5 ప్లేస్ ను మరోసారి సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది.
ఇక 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
AP-TG 14th Day Highest Share Movies
👉#Baahubali2 – 3.80Cr
👉#AVPL- 2.77Cr
👉#WaltairVeerayya – 2.11CR
👉#RRRMovie – 1.86Cr
👉#Pushpa2TheRule – 1.76CR******
👉#Devara Part 1: 1.44Cr
👉#Baahubali: 1.42Cr
👉#Sarrainodu: 1.41Cr
👉#F2: 1.33Cr
👉#GeethaGovindam- 1.31Cr
👉#ShatamanamBhavati: 1.30Cr
👉#Rangasthalam: 1.26Cr
👉#TilluSquare: 1.24Cr
ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఏడున్నర ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి2 ఎపిక్ లాంగ్ రన్ పవర్ తో టాప్ లోనే ఉండగా రెండో ప్లేస్ లో అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో మూవీ నిలవగా టాప్ 5 లో 2 సినిమాలతో మాస్ ఊచకోత కోశాడు ఇప్పుడు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.