2024 ఇయర్ కి గాను బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ టాప్ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ, మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 294 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా…
వరల్డ్ వైడ్ గా 1403 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేసిన సినిమా ఇక 15వ రోజు వర్కింగ్ డే లో మరోసారి అన్ని చోట్లా సాలిడ్ హోల్డ్ ని చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 2.8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ లో కలిపి ఓవరాల్ గా 2.2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఇక సినిమా హిందీ లో మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా 15.5-16 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా మరోసారి మంచి జోరుని చూపెడుతున్న సినిమా టోటల్ గా 15వ రోజున వరల్డ్ వైడ్ గా 23 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…
గ్రాస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది….మొత్తం మీద ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 297 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1426 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోవచ్చు. ఫాస్టెస్ట్ రికార్డులతో దూసుకు పోతున్న సినిమా ఇక 15 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.