లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో చిన్న సినిమానే అయినా కూడా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకుని తెలుగులో పర్వాలేదు అనిపించింది విడుదలై సినిమా….ఆ సినిమాకి ప్రీక్వెల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విడుదల పార్ట్ 2(Vidudala Part 2 Telugu Review) సినిమా వచ్చింది…విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా..
ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ కి వస్తే చాలా ఏళ్లుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న మాస్టర్ కం నక్సలైట్ లీడర్ అయిన విజయ్ సేతుపతి ఎందుకని నక్సలైట్ గా మారాడు…తన బ్యాక్ స్టోరీ ఏంటి అనేది సినిమా కథ పాయింట్….
మొదటి పార్ట్ లో అడవుల్లో పోలీసులు నక్సలైట్ లను పట్టుకోవడానికి పడే కష్టం ఎలా ఉంటుంది…చివర్లో నక్సలైట్ నాయకుడి ఎలా పట్టుకున్నారు అన్నది ఎంతో ఆసక్తిగా చూపించగా ఇందులో ఆ నక్సలైట్ నాయకుడు లైఫ్ స్టోరీ ని చూపించారు…సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూసి…
హీరో రెబల్ గా మారతాడు అలాంటి హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది…ఆ తర్వాత నక్సలైట్ గా మారిన తీరు ఇవన్నీ చాలా లెంత్ గా అనిపించాయి. కంప్లీట్ గా సీరియస్ టోన్ తో సాగే సినిమా ఆల్ మోస్ట్ ఒక డాక్యుమెంటరీ టైప్ లో అనిపించింది…
కానీ డైరెక్టర్ వెట్రిమారన్ చెప్పిన తీరు మెప్పించింది…లెంత్ ఎక్కువ అయినా కూడా ఇలాంటి సీరియస్ కథలు నచ్చే ఆడియన్స్ కి సినిమా బాగానే నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె మట్టుకు….మరీ మొదటి పార్ట్ రేంజ్ లో లేని…
నార్మల్ డాక్యుమెంటరీ టైప్ మూవీ లా అనిపిస్తుంది విడుదల పార్ట్ 2….విజయ్ సేతుపతి తన రోల్ వరకు అదరగొట్టేశాడు…తన పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించగా మంజు వారియర్ కూడా మెప్పించింది. ఇక సూరి రోల్ కూడా ఉన్నంతలో ఆకట్టుకోగా…సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఓకే అనిపించగా…
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకా టైట్ గా ఉంటే బాగుండేది…లెంత్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది. కథ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ చెప్పిన విధానం నెమ్మదిగా సీరియస్ టోన్ తో చెప్పడంతో కొంచ బోర్ ఫీల్ అయ్యేలా చేసింది…కానీ మొత్తం మీద…
సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒకప్పుడు ఉన్న పరిస్థితులను బాగానే ప్రజెంట్ చేసిన డైరెక్టర్ లెంత్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా ఈజీగా ఒకసారి చూసేలా విధంగా ఉండేది. ఇప్పుడు కూడా ఇలాంటి మెసేజ్ అండ్ సీరియస్ టైప్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా నచ్చే అవకాశం ఉంది..
అదే టైం లో రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కొంచం ఓపిక చేసుకుని చూస్తె ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను సినిమా అయితే ఇస్తుంది అని చెప్పాలి…ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…