బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కొన్ని సినిమాలు అనుకున్న దానికి మించి హిట్స్ గా నిలిచాయి…డబ్బింగ్ మూవీస్ లో కూడా కొన్ని సాలిడ్ హిట్స్ గా నిలిచాయి కానీ, భారీ పోటిలో ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇతర సినిమాలను సైతం డామినేట్ చేస్తూ లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది…
శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా….ఎక్స్ లెంట్ పాజిటివ్ రివ్యూలతో ఓపెన్ అయినా కూడా సీరియస్ సబ్జెక్ట్ అయినా కూడా తెలుగు లో లాంగ్ రన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది…
సినిమా తెలుగు లో మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా 5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది…టోటల్ రన్ లో సినిమా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తెలుగులో ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…
ఒకసారి సినిమా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie Telugu States Total Collections (Inc GST)
👉Nizam: 13.15Cr~
👉Ceeded: 3.20Cr~
👉Andhra: 11.65Cr~
AP-TG Total:- 28.00CR(50.75Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఫైనల్ కలెక్షన్స్ లెక్క..
అంచనాలను అన్నీ మించి పోయి ఊహకందని ఊచకోత కోసిన అమరన్ సినిమా తెలుగు లో డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది…బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 22.50 కోట్ల ప్రాఫిట్ తో క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…