బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ ఎపిక్ మమ్మోత్ బ్లాక్ బస్టర్ ల సినిమాల కలెక్షన్స్ రికార్డులను ఓ రేంజ్ స్పీడ్ తో బ్రేక్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), హిందీలో ఆల్ రెడీ ఎపిక్ కలెక్షన్స్ తో అన్ని రికార్డుల బెండు తీసిన పుష్ప2 మూవీ…
ఎపిక్ బాహుబలి2 మూవీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని అందుకున్న మూవీస్ పరంగా…
ఎపిక్ కలెక్షన్స్ తో బాహుబలి2 మూవీ నమోదు చేసిన ఎపిక్ షేర్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది….బాహుబలి2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 204 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…ఇప్పుడు ఈ రికార్డ్ ను క్రాస్ చేసిన పుష్ప2 మూవీ…
210 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా గ్రాస్ పరంగా మాత్రం బాహుబలి2 ఇప్పటికీ 330 కోట్ల గ్రాస్ తో ఉండగా పుష్ప2 మూవీ 315 కోట్లకు పైగా గ్రాస్ తో టాప్ 3 లో ఉంది. కానీ షేర్ పరంగా ఆల్ టైం టాప్2 ప్లేస్ తో దూసుకు పోతున్న పుష్ప2 మూవీ…
ఓవరాల్ గా టాప్ ప్లేస్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ ని మాత్రం అందుకోవడం మాత్రం కష్టమే అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 272 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా ఈ మార్క్ ని అందుకోవడం పుష్ప2 కి కష్టమే అని చెప్పాలి.
రెండు సినిమాల మధ్య గ్యాప్ ఆల్ మోస్ట్ 62 కోట్లకు పైగా గ్యాప్ ఉండగా ఈ మార్క్ ని లాంగ్ రన్ లో కూడా అందుకోవడం కష్టమే అని చెప్పాలి. మొత్తం మీద పుష్ప2 మూవీ ఆల్ టైం టాప్ 2 తో తెలుగు రాష్ట్రాలలో ఊరమాస్ రచ్చ చేయబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా ఊచకోత కోసింది ఇప్పుడు.