Home న్యూస్ హాట్రిక్ హిట్స్ బాలయ్య….డాకు మహారాజ్ సాంగ్స్ కి ఈ రెస్పాన్స్ ఏంటి సామి!!

హాట్రిక్ హిట్స్ బాలయ్య….డాకు మహారాజ్ సాంగ్స్ కి ఈ రెస్పాన్స్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సీనియర్ హీరోలలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వరుస పెట్టి విజయాలతో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు…బాక్ టు బాక్ 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ…

డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తమన్ అందించిన సాంగ్స్ కి మాత్రం…

రెస్పాన్స్ ఇప్పుడు ఏమాత్రం ఆశించిన మేర సొంతం అవ్వలేదు…బాలయ్య తమన్ ల కాంబోలో ఆల్ రెడీ హాట్రిక్ ఆల్బమ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య కూడా హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపుతూ ఉండగా ఇలాంటి టైంలో….బాలయ్య కొత్త సినిమా…

మీద అంచనాలు ఆల్ రెడీ సాలిడ్ గా ఉన్నప్పటికీ సినిమా నుండి రిలీజ్ అయిన 2 సాంగ్స్ కి రెస్పాన్స్ మాత్రం ఏమాత్రం ఆశించిన రేంజ్ లో రాలేదు. సినిమా నుండి వచ్చిన మొదటి పాట అయిన రేజ్ ఆఫ్ డాకు సాంగ్ 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 1.5 మిలియన్స్ రేంజ్ లో…

వ్యూస్ మార్క్ ని అందుకున్న సాంగ్ లైక్స్ పరంగా 70 వేల లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుని బిలో పార్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా నుండి రెండో సాంగ్ అయిన చిన్ని అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు….ఈ సాంగ్ కి కూడా…

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నా కూడా 24 గంటల్లో ఓవరాల్ గా 1.3 మిలియన్ వ్యూస్ మార్క్ ని మాత్రమే అందుకోగా లైక్స్ పరంగా 58 వేల రేంజ్ లోనే లైక్స్ మార్క్ ని అందుకుంది…మొత్తం మీద రెండు సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా…

ఓవరాల్ గా హాట్రిక్ విజయాల హీరో-మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబోలో వచ్చిన సినిమాకి రావల్సినంత రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదు…కానీ సినిమా ఔట్ పుట్ మాత్రం సాలిడ్ గా వచ్చిందని అంటున్నారు. మరి సంక్రాంతికి బాలయ్య ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here