మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) డైరెక్ట్ చేసిన సినిమా బరోజ్(Barroz Movie Telugu Review) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అయింది. తెలుగు లో కూడా డబ్ అయిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో కొంచం క్యూరియాసిటీ పెరిగింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే గోవా నుండి పోర్చుగల్ సామ్రాజ్యం విడిచి పెట్టి వెళ్ళే టైంలో తమ సంపదను కాపాడటానికి ఒక మాంత్రికుడు అయిన బరోజ్ ని నియమిస్తుంది…ఏళ్ళు గడిచినా కూడా హీరో విముక్తి పొందలేక పోతాడు…అలా 400 ఏళ్ల గడిచిన తర్వాత…
తన విముక్తి కోసం మాంత్రికుడు అయిన హీరో ఏం చేశాడు ఆ తర్వాత ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ వరకు ఆసక్తిగానే ఉన్నప్పటికీ కూడా చెప్పిన విధానం మాత్రం పూర్తిగా నిరాశ పరిచేలా ఉంటుంది…భారీ బడ్జెట్ తో హాలీవుడ్ ఫాంటసీ సినిమాల రేంజ్ లో..
తీశాం అంటూ చెప్పుకున్నా కూడా గ్రాఫిక్స్ క్వాలిటీ కానీ 3D ఎఫెక్ట్ లు కానీ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయాయి….కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా కూడా చాలా వరకు సినిమా సహనానికి పరీక్ష పెట్టేలా ఉందని చెప్పాలి..
ఉన్నంతలో మోహన్ లాల్ పర్వాలేదు అనిపించినా మిగిలిన పాత్రలు బిలో పార్ అనిపించేలా ఉంటాయి…ఇసాబెల్లా రోల్ చేసిన అమ్మాయి పెద్దగా సెట్ అవ్వలేదు….బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు…సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా…
ఎక్కడా ఎమోషనల్ గా సినిమా కనెక్ట్ అవ్వకపోవడం, డ్రాగ్ మరీ పెరిగిపోవడంతో ఒక దశలో సినిమా మరీ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది…చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని సినిమాను తీసినప్పటికీ వాళ్ళకి కూడా నచ్చేలా సన్నివేశాలు చాలా తక్కువగానే ఉన్నాయి సినిమాలో…
చాలా ఓపిక పట్టి చూసినా కూడా సినిమా పూర్తి అయ్యే టైంకి ఆడియన్స్ చాలా చోట్ల బోర్ ఫీల్ అవుతారు….హాలీవుడ్ స్టైల్ లో చెప్పాలని చేసిన బరోజ్ మూవీ పెద్దగా ఇంపాక్ట్ ఏమి క్రియేట్ చేయలేక పోయింది… మొత్తం మీద క్రిస్టమస్ వీకెండ్ లో…
బరోజ్ మూవీస్ తో పోల్చితే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి…ఈ సినిమానే చూడాలి అంటే మాత్రం చాలా ఓపిక మీకు అవసరం అని చెప్పాలి. అంత ఓపిక పట్టి చూస్తె అతి కష్టం మీద యావరేజ్ గా అనిపించవచ్చు…టీం సినిమా కోసం పెట్టిన కొన్ని ఎఫెక్ట్స్ కి…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2 స్టార్స్…