సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) హిందీలో మాత్రం నెక్స్ట్ లెవల్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా మూడు వారాలు హిందీ లో అసలు ఎలాంటి పోటి లేకుండా…
మాస్ రచ్చ చేసిన పుష్ప2 సినిమా ఇప్పుడు నాలుగో వీక్ లో అడుగు పెట్టగా బాలీవుడ్ లో వరుణ్ ధవన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ బేబీ జాన్(Baby John Movie) మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి హిందీలో మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కూడా…
మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయిన సినిమా 11.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 21వ రోజులో ఉన్న పుష్ప2 మాత్రం ఊచకోత కోస్తూ 15.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు వర్కింగ్ డే లో…
పుష్ప2 మూవీ ఊచకోత ముందు బేబీ జాన్ మూవీ కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది…బేబీ జాన్ కి చుక్కలు చూయిస్తూ 22వ రోజులో ఉన్న పుష్ప2 మూవీ ఏకంగా 9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా బేబీ జాన్ మాత్రం భారీ గా డ్రాప్ అయ్యి రెండో రోజు మొత్తం మీద హిందీలో…
కేవలం 5 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. అంటే బేబీ జాన్ మీద 22వ రోజులో ఉన్న పుష్ప2 డబుల్ గ్రోత్ ని కలెక్షన్స్ లో చూపించింది. దాంతో ఈ వీక్ భారీ ఆశలు పెట్టుకున్న బేబీ జాన్ హిందీ లో చేతులు ఎత్తేయడంతో…
మరోసారి పుష్ప2 సినిమానే హిందీ ఆడియన్స్ కి మొదటి ఛాయిస్ గా మారబోతుంది…ఆల్ రెడీ బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన పుష్ప2 మూవీ టోటల్ రన్ లో ఇప్పుడు అవలీలగా 800 కోట్ల నెట్ కలెక్షన్స్ ని దాటేసి 850 కోట్ల నెట్ కలెక్షన్స్ ని టార్గెట్ చేయబోతుంది పుష్ప2 మూవీ…