నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ రిజల్ట్ లను సొంతం చేసుకుని బాక్ టు బాక్ హిట్స్ తో హట్రిక్ ను నమోదు చేసి కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న టైంలో ఈ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు బాలయ్య నటించిన డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) తో మాస్ రచ్చ చేశాడు…
సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊరమాస్ ఊచకోత తర్వాత స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది కానీ లాంగ్ రన్ లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను ఫుల్లుగా అందుకోక పోయినా కూడా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకుంది సినిమా…
ఇక బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది…నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపొయింది…అప్పట్లో బాలయ్య సినిమాలు అంటే ట్రోల్ స్టఫ్ కోసం వెతికే వారు…కానీ రీసెంట్ టైంలో అది చేంజ్ అవ్వగా…
డాకు మహారాజ్ సినిమాలో ఎలివేషన్ లు, తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ వీడియోలు సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో షేక్ అవుతూ ఉండటం విశేషం. ఇక సినిమాకి ఓటిటి లో రెస్పాన్స్ కూడా సాలిడ్ గానే ఉందని చెప్పాలి. కథ పాయింట్…చిన్న పాపతో బాలయ్య అటాచ్ మెంట్ లాంటివి అందరికీ నచ్చగా…
ఫస్టాఫ్ లో హీరోయిజం ఎలివేట్ సీన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే సెకెండ్ ఆఫ్ లో స్టార్టింగ్ కొంచం డౌన్ అయినా తర్వాత ఎలివేషన్ లు ఫైట్ సీన్స్ అన్నీ రీసెంట్ టైంలో బాలయ్య కెరీర్ లో బెస్ట్ ఔట్ పుట్స్ లో ఒకటిలా అనిపించాయి అని అంటున్నారు….
కానీ ఓవరాల్ గా సినిమా బాగున్నా ఇది సంక్రాంతికి కాకుండా సోలో గా రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకునే రేంజ్ మూవీ అని అంటున్నారు….మొత్తం మీద సినిమా కి డిజిటల్ రిలీజ్ రెస్పాన్స్ యునానిమస్ లెవల్ లో ఉందని చెప్పాలి.
ఓవరాల్ గా బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ రీసెంట్ టైంలో వచ్చిన టాప్ అండ్ సీనియర్ హీరోల సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా రిచ్ విజువల్స్ తో మెప్పించిన సినిమాల్లో ఒకటి అని చెప్పాలి…అది కూడా డిజిటల్ లో సాలిడ్ గా హైలెట్ అవుతూ ఉండటంతో ఓటిలో సాలిడ్ లాంగ్ రన్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.