బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లోనే రిమార్కబుల్ జోరుని చూపించిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) 4వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర రంజాన్ పండగ అడ్వాంటేజ్ కలిసి రావడంతో మరోసారి మాస్ ఊచకోత కోసింది. అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో జోరు చూపించి..
తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ షేర్స్ ని రాబట్టి రచ్చ చేయడం విశేషం. సినిమా 3.5-3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని 4వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించినా కూడా ఆ అంచనాలను కూడా మించి పోయిన సినిమా ఓవరాల్ గా 4వ రోజున 4.03 కోట్ల రేంజ్ లో…
షేర్ మార్క్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా కుమ్మేసింది. వరల్డ్ వైడ్ గా మాత్రం కొంచం డౌన్ అయిన సినిమా 4.53 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా 7.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేయడం విశేషం.
దాంతో మొత్తం మీద ఇప్పుడు 4 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
MAD Square Movie 4 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 9.56Cr
👉Ceeded: 2.74Cr
👉UA: 2.60Cr
👉East: 1.68Cr
👉West: 0.81Cr
👉Guntur: 1.51Cr
👉Krishna: 1.21Cr
👉Nellore: 0.68Cr
AP-TG Total:- 20.79CR(33.75CR~ Gross)
👉KA+ROI: 1.55Cr
👉OS – 5.15Cr****approx
Total WW Collections: 27.49CR(Gross – 47.85CR~)
మొత్తం మీద సినిమా 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 5.49 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.