టాలీవుడ్ లో బహుశా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు…. స్పై త్రిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుండటం ఇప్పటి వరకు జరగలేదు. కానీ పక్కా పకడ్బందీ కథ ఉంటే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే సత్తా స్పై థ్రిల్లర్ జానర్ కి ఉందని అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమా నిరూపించింది.
అఫీషియల్ గా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 6.8 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ అయిపోవడమే కాకుండా లాభాలను కూడా సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు 10 రోజులు ముగిసే సరికి 8.4 కోట్ల షేర్ ని ఈ సినిమా సాధించింది. సెకెండ్ వీకెండ్ లో సినిమా 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రెండు వారాలు ముగిసే లోపు సినిమా 10 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల్లో డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.