గత రెండు రోజులుగా సోషల్ మీడియా ని ఊపేస్తున్న న్యూస్ ఇది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలో నిలిచి అంచనాలను పూర్తిగా అందుకోలేక టోటల్ రన్ లో భారీ నష్టాలను మిగిలించి డిసాస్టర్ గా మిగిలి పోయిన విషయం అందరి కీ తెలిసిందే.
కాగా సినిమా పరాజయం పాలు అవ్వడం…. రామ్ చరణ్ అనుకోకుండా సినిమా బిజినెస్ లో కలగజేసుకుని యు వి క్రియేషన్స్ వారికి ఒకరిద్దరు తెలిసిన వాళ్ళ ని సినిమాను అమ్మడంలో హెల్ప్ చేయడం, తర్వాత సినిమా రిజల్ట్ తో అందరికీ భారీ నష్టాలు వచ్చాయి.
దాంతో తనవల్ల నష్టపోయారు అని రామ్ చరణ్ తన వంతుగా రెమ్యూనరేషన్ నుండి 5 కోట్లు రిటర్న్ ఇవ్వడానికి ఒప్పుకోగా నిర్మాత దానయ్య కూడా 5 కోట్లు రిటర్న్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, కానీ బోయపాటి శ్రీను ని కూడా అడగ్గా ఒక్క పైసా కూడా ఇవ్వనని ముందు చెప్పాడని..
ఇండస్ట్రీ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి, అంతే కాకుండా నిర్మాత తో మాటల యుద్ధం కూడా జరిగిందని సమాచారం. దాంతో చివరగా కోటి ఇవ్వడానికి బోయపాటి ఒప్పుకున్నాడని అంటుండగా నిర్మాత 5 కోట్లు ఇవ్వాల్సిందే అని నిర్ణయం తీసుకున్నాడట. దాంతో చర్చలు తీవ్రంగా జరిగాయని అంటున్నారు.
ఫైనల్ గా పెద్దలు కలగజేసుకుని ఇప్పుడు ఈ మ్యాటర్ ని సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం, సినిమా కోసం పని చేసి డబ్బులు తీసుకోవడం తప్పు లేదు, భారీ రేట్ల కి కొన్న బయ్యర్లు వేరే సినిమాల్లో లాభాలు వస్తే రిటర్న్ ఇవ్వరు.. కానీ ఇలా నష్టపోయినప్పుడు మాత్రం డబ్బులు కావాలి అనడం ఏంటి అనేది నెటిజన్ల మాట… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.