Home న్యూస్ యాత్ర ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫ్లాఫా!!

యాత్ర ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫ్లాఫా!!

0

    2004 సమయంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ రోజు మంచి అంచనాల నడుమ వచ్చేసింది. సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుని తొలి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది, మరి ఆ టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ గురించి అందరికీ తెలిసిందే, పాద యాత్ర ని వై ఎస్ ఆర్ ఎందుకని మొదలు పెట్టాడు, ఎలా ముగించాడు, ప్రజల మనసును ఎలా తెలుసుకుని గెలుచుకున్నాడు అన్నది ఓవరాల్ పాయింట్ అని అంటున్నారు. ఇక స్క్రీన్ ప్లే పరంగా సినిమా చాలా…

స్లో గా సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నడుస్తుందని, అది కొందరికి ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని అంటున్నారు, ఫస్టాఫ్ కథ కొంచం త్వరగా గడిచినప్పటికీ సెకెండ్ ఆఫ్ స్లో సీన్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టాయని, అవి తప్పితే సినిమా లో మేజర్ మైనస్ పాయింట్స్ ఏవి లేవని అంటున్నారు.

కానీ ఇది ఒక బయోపిక్ అందునా పొలిటికల్ నేపధ్యంలో ఉన్న సినిమా అవ్వడం తో కామన్ ఆడియన్స్ అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కి జస్ట్ ఓకే నుండి ఎబో యావరేజ్ గా అనిపించినా ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు. మమ్ముట్టి వై ఎస్ రోల్ లో అద్బుతంగా నటించి మెప్పించాడని..

Yatra Pre Release Business - Box Office Target

ముఖ్యంగా డైలాగ్ డిలివరీ చాలా ఆకట్టు కుంటుందని, పెర్ఫార్మెన్స్ కూడా వంకపెట్టకుండా చేశాడని అంటున్నారు, మిగిలిన పాత్రలు అన్నీ మమ్ముట్టి ముందు తెలిపోయాయని అంటున్నారు. సంగీతం సినిమా కి తగ్గట్లు ఉందని అంటున్నారు.

డైరెక్షన్ బాగుందని, కానీ అక్కడక్కడా స్లో నరేషన్ ని ఎంచుకోవడం కథ ని డ్రాగ్ చేయడం మేజర్ మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. మొత్తం మీద వై ఎస్ ఆర్ అభిమానులను పండగ లాంటి సినిమా అని కానీ కామన్ ఆడియన్స్ మాత్రం…

ఒకసారి ఈజీ గా చూసే విధంగా సినిమా ఉందని అంటున్నారు. ఫైనల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సినిమాకి ఎబో యావరేజ్ టాక్ లభించింది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోల కి ఫైనల్ గా ఎలాంటి టాక్ లభిస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here