కామెడీ సినిమాల తో టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్ లిస్టు లో చోటు దక్కించు కున్నాడు శ్రీనువైట్ల. తొలి సినిమా నీకోసం ని వదిలేస్తే తాను చేసిన ప్రతీ సినిమా కామెడీని బేస్ చేసుకుని తీసిందే. కెరీర్ ని నిలబెట్టిన కామెడీ తరువాత రెండు ఫార్మాట్ల లోకి మారి శ్రీనువైట్ల సినిమా అంటే ఆ రెండు స్టొరీలైన్స్ లో ఎదో ఒకటి కచ్చితంగా వాడి ఉంటాడని జనాలలో బలమైన ముద్ర పడిపోయింది.
ఇంతకీ శ్రీనువైట్ల వాడే స్టోరీలు ఏంటో తెలుసా. దూకుడు ముందు వరకు హీరో తనకోసమో, ఫ్యామిలీ కోసమో విలన్ల ఇంట్లో రచ్చ చేయడం అయితే దూకుడు తరువాత తండ్రి, ఫ్రెండ్, సిస్టర్ సెంటిమెంట్ కోసం విలన్లను ఆటాడుకుంటాడు. రూట్ కొంచం అటూఇటూగా ఉన్నా స్టోరీ మొత్తానికి మాత్రం ఒకటే.
ఇన్నాళ్ళు పనిచేసిన ఈ స్టోరీలైన్ ని ఈ మధ్య ప్రతీ ఒక్కరూ ఫాలో అవుతుండటంతో ఆ స్టోరీని కనిపెట్టిన శ్రీనువైట్లల సినిమాలకు విమర్శల వెల్లువ ఎక్కువయింది. దూకుడు తరువాత బాద్ షా ని సేఫ్ జోన్ లో నడపాలని అలా చేశారు అనుకున్న ఆగడు, బ్రూస్ లీ, అమర్ అక్బర్ ఆంథోనీ ల విషయం లో మాత్రం తేడా గట్టిగా కొట్టింది. ఇకనైనా కొత్తగా ఆలోచించకపొతే టాప్ 5 లిస్టు నుండి త్వరలోనే కిందకి చేరడం తధ్యం.