స్టార్ హీరోల సినిమాలకు బిజినెస్ లు ఓ రేంజ్ లో జరగడం కామన్, టాప్ స్టార్స్ అందరి సినిమాలకు మేజర్ ఏరియాల్లో భారీ బిజినెస్ లు జరగడం కూడా కామన్, టాలీవుడ్ లో అతి ముఖ్యమైన ఏరియాల్లో ఒకటిగా భావించే నైజాం ఏరియాల్లో టాప్ స్టార్స్ నటించిన సినిమాలకు అవలీలగా 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ లు జరగడం మనం చూస్తూనే ఉన్నామ్, ఇక టాప్ స్టార్స్ తర్వాత స్టార్ హీరోల లిస్టులో ఉండే మీడియం బడ్జెట్ హీరోలలో…
సినిమాల రేంజ్ ని బట్టి కొందరు ఈ ఏరియాలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉంటారు, వారి లో ఓ ముగ్గురు నటించిన సినిమాలు ఇప్పుడు వరుసగా ఒకటి తర్వాత ఒకటి వారం గ్యాప్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. అవే రామ్ నటించిన…
ఇస్మార్ట్ శంకర్, విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలు…వీటి లో నాని సినిమా వచ్చే నెలలో రాబోతుండగా రామ్ విజయ్ ల సినిమాలు ఈ నెల లో రాబోతున్నాయి. కాగా రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ నైజాం ఏరియాలో ఆల్ మోస్ట్…
6.8 కోట్ల నుండి 7 కోట్ల దాకా రేటు పలికిందట, ఇక విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మూవీ కి 7.1 కోట్ల దాకా రేటు దక్కినట్లు సమాచారం. కాగా ఈ లీగ్ లో సీనియర్ అయిన నాని గ్యాంగ్ లీడర్ సినిమా కి ఏకంగా 8.5 కోట్ల దాకా రేటు దక్కిందని సమాచారం…
దాంతో MCA తర్వాత నికార్సయిన బ్లాక్ బస్టర్ పడక పోయినా కానీ నాని స్టార్ హీరోలలో తన రేంజ్ ని మెయిన్ టైన్ చేస్తూ దూసుకు పోతున్నాడు. ఇక ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తాయి అన్నది ఆసక్తి కరంగా చెప్పుకోవచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.