Home గాసిప్స్ కర్ణాటక లో డియర్ కామ్రేడ్ బ్యాన్…రీజన్ ఇదే??

కర్ణాటక లో డియర్ కామ్రేడ్ బ్యాన్…రీజన్ ఇదే??

0

  అర్జున్ రెడ్డి లాంటి అనేక కాంట్రవర్సీలున్న సినిమానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక లో ఇరగాడేసింది అలాంటిది పెద్దగా కాంట్రవర్సీలు లేని డియర్ కామ్రేడ్ బ్యాన్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా….. డానికి కారణం సినిమా కంటెంట్ కాదు, సినిమా నే… చాలా ఏళ్లుగా కన్నడ సినిమాలకు ధీటు గా అక్కడ ఇతర భాషల సినిమాలకు కూడా సమానమైన కుదిరితే ఎక్కువ థియేటర్స్ ఇస్తూ వస్తున్నారు అక్కడి థియేటర్ ఓనర్లు.

దాంతో సొంత కన్నడ సినిమాలకు చాలినన్ని థియేటర్స్ దొరకడం లేదు అన్నది ముందు నుండి ఉన్న వాదనే, రీసెంట్ టైం లో కన్నడ మూవీస్ ని పక్కకు పెట్టి మరీ తెలుగు ఇతర భాషల సినిమాలను భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటం తో అక్కడ ఆడియన్స్ నుండి ఇండస్ట్రీ లో ఉండే వాళ్ళ దాకా అందరు విసుగెత్తి పోయి ఇప్పుడు ఇతర భాషల సినిమాలను బ్యాన్ చేయాలనీ చూస్తున్నారు.

ఆ మూవ్ మెంట్ సరిగ్గా డియర్ కామ్రేడ్ రిలీజ్ సమయంలో జరగడం మొదలు పెట్టడంతో ఈ సినిమా ను బ్యాన్ చేయాలనీ నినాదాలు అక్కడ ఎక్కువ అయ్యాయని సమాచారం, దాంతో ఈ గొడవ పెద్దదైతే ఈ వీకెండ్ లో డియర్ కామ్రేడ్ తో పాటు మరిన్ని సినిమాలను అక్కడ బ్యాన్ చేస్తారని టాక్ నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here