Home గాసిప్స్ సైరా కోసం 26 స్టూడియోలు….ఏం జరుగుతుందో మరి!!

సైరా కోసం 26 స్టూడియోలు….ఏం జరుగుతుందో మరి!!

0

     టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత చేస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా గత రెండేళ్ళుగా షూటింగ్ ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే, కాగా సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకు చేరుకున్నా కానీ సినిమా లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ వర్క్ భారీ గా ఉండటం తో సినిమా ను అనుకున్న సమయానికి…

ప్రేక్షకుల ముందుకు తెస్తారో లేదో అనుమానాలు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ గ్రాఫిక్స్ వర్క్ పూర్తిగా కంప్లీట్ చేసే సమయానికి ఈ ఇయర్ ఎండ్ అయ్యే అవకాశం ఉందని సినిమా ను సంక్రాంతి కి రిలీజ్ చేస్తారని వార్తలు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి.

కానీ ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మరో వార్తా ప్రకారం ఎట్టి పరిస్థితులలో సినిమాను అనుకున్న డేట్ అయిన అక్టోబర్ 2 నే ప్రేక్షకుల ముందుకు తేవాలి అని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 గ్రాఫిక్స్ కంపెనీ లకు సినిమా VFX పనులను అప్పగించారట. ఆ కంపెనీలు ఇండియా, అమెరికా, రష్యా, జపాన్…

ఇలా పలు దేశాల VFX ఎక్స్ పెర్ట్స్ ఇప్పుడు ఈ సినిమా కోసం పని చేయబోతున్నారట. దాంతో వర్క్ త్వరగా కంప్లీట్ అయ్యి సినిమా అక్టోబర్ 2 న అనుకున్న విధంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది జరగాలి అంటే ఒకపక్క గ్రాఫిక్స్ పనులతో పాటు….

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చక చకా జరగాలు, ఇప్పుడు యూనిట్ ఆ పనిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే సినిమా ప్రమోషన్ పనులను మొదలు పెట్టె చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఆశగా ఎదురు చూడటం మొదలు పెట్టారు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here