Home న్యూస్ 16 రోజులు 2.5 రేటింగ్…75 కోట్ల ఊచకోత…మాస్ ఊరమాస్!!

16 రోజులు 2.5 రేటింగ్…75 కోట్ల ఊచకోత…మాస్ ఊరమాస్!!

0

రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 2 వారాల లోనే 35 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సత్తా చాటింది, రెండో వారం లో డియర్ కామ్రేడ్ పోటి లో ఉన్నా కానీ ఇస్మార్ట్ శంకర్ కే జనాలు ఓటు వేశారు. ఇక మూడో వీక్ లో అడుగు పెట్టిన ఈ సినిమా 2 కొత్త సినిమాలు రాక్షసుడు మరియు గుణ 369 సినిమా నుండి పోటి ని ఎదురుకున్నా….

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది, సినిమా 15 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 23 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయగా 16 వ రోజున కూడా కొత్త సినిమా ల పోటి ఉన్నా కూడా 20 లక్షల షేర్ ని సాధించింది.

మొత్తం మీద సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
#iSmartShankar Day 16 Ap-TG: 0.20C??
?Total 16 Days ApTg Collections: 33.12C?
?Day 16 WW collections: 0.21C
?Total 16 Days WW collections: 35.95C?
?BreakEven 18.8C
(B-L-O-C-K-B-U-S-T-E-R)
Profit:-17.15C profit as of Now
?Total Gross: Trade 63.71C- Producer 75C~

కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అద్బుతమైన రివ్యూ లతో రిలీజ్ కాలేదు… మినిమం రేటింగ్ 2.5 రేటింగ్ నుండి 2.75 స్టార్ రేటింగ్ వరకు దక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవర్సీస్ లో పెద్దగా కలెక్షన్స్ ని అందుకొక పోయినా కానీ ఇప్పటి వరకు 36 కోట్ల వరకు…

షేర్ ని ఆల్ మోస్ట్ సాధించి దుమ్ము లేపింది. ఇక గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 63.7 కోట్ల దాకా ఉండగా నిర్మాతలు ఏకంగా 75 కోట్ల గ్రాస్ ని సినిమా వసూల్ చేసిందని పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఫైనల్ రన్ లో 40 కోట్ల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయో లేదో 3 వ వారం వర్కింగ్ డేస్ హోల్డ్ ని బట్టి చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here