బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో అల్ట్రా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మొదటి సినిమా రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సాధించడానికి కష్టపడుతుంది, మొదటి రోజు మొత్తం మీద 2.3 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.99 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన రాక్షసుడు సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళనే సాధించింది. కానీ అది సినిమా బిజినెస్ కి న్యాయం చేసే విధంగా లేదు.
రెండో రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన షేర్ 1.6 కోట్లు… ఏరియాల వారి కలెక్షన్స్ రెండో రోజు ఇలా ఉన్నాయి..
Nizam – 74L
Ceded – 24L
UA – 21L
Krishna – 11.5L
Guntur – 8L
West – 7.2L
East – 10L
Nellore – 5L
APTG- 1.60Cr
ఇక సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ 4.04 కోట్లు… టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
Nizam – 1.39cr
Ceded – 55L
UA – 55L
Krishna – 24.5L
Guntur – 31L
West – 19.7L
East – 24L
Nellore – 11.3L
APTG- 3.60Cr
Ka & ROI – 18L
Os – 26L
2 Days Total – 4.04Cr
సినిమాను టోటల్ గా 16.2 కోట్లకు అమ్మారు, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది, తొలి రెండు రోజుల్లో మొత్తం మీద 4.04 కోట్లు మాత్రమె రికవరీ చేసిన సినిమా మరో 13.16 కోట్ల షేర్ ని మిగిలిన రన్ లో రికవరీ చేయాల్సి ఉంటుంది.
పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా తొలి వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ చాలా కీలకం, కానీ రాక్షసుడు తొలి వీకెండ్ లో అంత టాక్ బాగున్నా ఇలాంటి కలెక్షన్స్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ కష్టం అవుతుంది, ఇక మూడో రోజు సినిమా ఎంతవరకు బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.