ఇదీ మరీ విచిత్రంగా ఉంది,.. ఇక్కడ హిట్ అయిన సినిమా వేరే భాషలో రీమేక్ అయ్యి అది మళ్ళీ ఇక్కడే డబ్ అయ్యి రిలీజ్ అవుతుండటం ఆ సినిమాను మంచి రేటు ఇచ్చి బయ్యర్లు కొనడం… ఇదంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో రీసెంట్ టైం లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన టెంపర్ సినిమా గురించి… 2015 లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ హిందీ లో….
సింబా పేరుతో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ఇక అదే సినిమాను తమిళ్ లో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేయగా తమిళ్ లో ఆడియన్స్ కి సినిమా పెద్దగా ఎక్కలేదు.. అక్కడ డిసాస్టర్ అయ్యింది ఈ సినిమా.
ఆ సినిమా రిలీజ్ సమయం లో తెలుగు లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయనని చెప్పిన విశాల్ తర్వాత మనసు మార్చుకుని సినిమా ను రీసెంట్ గా తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేయాలనీ ట్రై చేసినా కొన్ని కారణాల వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.
ఇప్పుడు తిరిగి సినిమా ఈ నెల 9 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా ఇక్కడ ఆసక్తి కరమైన వార్తా ఏంటి అంటే ఈ సినిమాను తెలుగు లో 2.2 కోట్లు ఇచ్చి కొన్నారట. తెలుగు ఆడియన్స్ అందరు చూసేసిన టెంపర్ ని ఇప్పుడు రీమేక్ డబ్ గా తెస్తున్నా ఈ రేటుకి కొనడం వింతే అని చెప్పాలి.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది, మరి ఎంతవరకు ఈ బిజినెస్ ని వెనక్కి తీసుకు వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.