ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాల తో 4 ఏళ్లుగా ఎలాంటి ఫ్లాఫ్స్ లేకుండా కెరీర్ లో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే, ఈ మధ్యకాలం లో లో ఒక ఇయర్ లో ఎన్టీఆర్ సినిమా లేకుండా ఉండటం 2019 లోనే జరగడం తో రాబోతున్న రెండేళ్ళ లో వరుస సినిమాలతో జోరు చూపాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్..
కాగా RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు ఒక్కటిగా కమిట్ అవుతూ వస్తున్నాయి. ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని తర్వాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఈ రెండు ప్రాజెక్ట్స్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అంటున్నారు.
కాగా ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా 2020 సెకెండ్ ఆఫ్ స్టార్టింగ్ లో మొదలు అవుతుందని, ఆ సినిమా ను తక్కువ సమయం లో షూట్ చేసి 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారని టాక్ నడుస్తుంది, ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ అవుతుందని….
ఈ సినిమా కి మాత్రం మళ్ళీ 1 ఏడాదికి పైగా సమయం పడుతుందని, ఈ సినిమాను అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాలను ఎన్టీఆర్ కమిట్ అవ్వగా ఈ సినిమాల తర్వాత సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.
వాటిలో అట్లీ తో ఒక సినిమా, కొరటాల తో సినిమా ఎన్టీఆర్ కమిట్ అయినట్లు తెలుస్తుంది, కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్ వచ్చే రెండు మూడేళ్ళు కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.