కింగ్ నాగార్జున కెరీర్ లో 2016 ఇయర్ లో సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమాల తర్వాత ఆశించిన విజయం దక్కలేదు, ఇలాంటి సమయం లో కెరీర్ లో బెస్ట్ క్లాసిక్ గా నిలిచిన మన్మథుడు సినిమా కి సీక్వెల్ గా మన్మథుడు 2 సినిమా తీయగా తొలి ఆటకే సోషల్ మీడియా భారీ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా కలెక్షన్స్ ని అందుకోలేక పోతూ కష్ట పడుతూనే ఉంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తి అయ్యే సరికి 9.37 కోట్ల షేర్ ని అందుకోగా 5 వ రోజున సినిమా 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా 40 లక్షల షేర్ కే పరిమితం అయ్యింది. ఇక వరల్డ్ వైడ్ గా 43 లక్షల షేర్ నే అందుకుంది.
దాంతో 5 రోజులు పూర్తి అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 8.17 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 9.8 కోట్ల షేర్ ని సాధించింది. తొలిరోజు 5 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో 5 కోట్లు కూడా వసూల్ చేయలేదు.
కానీ సినిమా బిజినెస్ ఏకంగా 18.5 కోట్లు అవ్వడం తో 19.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 9.7 కోట్ల షేర్ ని ఇప్పటి నుండి అందుకోవాల్సి ఉంటుంది, అది ప్రస్తుతానికి అసాధ్యంగా కనిపిస్తుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి దెబ్బ తగిలినట్లు అయింది.
ఇక రానున్న రోజుల్లో ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా ఈ మార్క్ ని అందుకోవడం కష్టమే, దాంతో టోటల్ రన్ లో ఇప్పుడు 11 కోట్ల లోపు కలెక్షన్స్ తో పరుగును ముగించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మరి 6 వ రోజు నుండి ఏదైనా అద్బుతం జరుగుతుందా లేదా చూడాలి.