Home గాసిప్స్ నాగార్జున “వైల్డ్ డాగ్” కి OTT ఆఫర్…సాలిడ్ రేటు ఇది!!

నాగార్జున “వైల్డ్ డాగ్” కి OTT ఆఫర్…సాలిడ్ రేటు ఇది!!

517
0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున దుమ్ము లేపే విజయాలను సొంతం చేసుకుని చాలా కాలమే అయింది. 4 ఏళ్ల క్రితం సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన నాగార్జున తర్వాత మాత్రం మళ్ళీ అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేక పోయాడు. ఇక తన లాస్ట్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని డిసాస్టర్లు గా నిలవడం మరింత షాక్ కి గురి చేసింది అనే చెప్పాలి.

ఆఫీసర్ సినిమా నెగటివ్ షేర్ అందుకుని బిగ్గెస్ట్ షాక్ ఇవ్వగా తర్వాత చేసిన మన్మథుడు 2 సినిమా మొదటి సినిమా పరువు తీసే రేంజ్ లో ఉందని తీవ్ర విమర్శలను ఎదురుకుని డిసాస్టర్ అయింది. ఇలాంటి టైం లో కూడా కింగ్ నాగార్జున మళ్ళీ ప్రయోగం తోనే…

ఆడియన్స్ ముందుకు వస్తుండటం ఆయన గట్స్ కి నిదర్శనం అని చెప్పొచ్చు. ఆ సినిమానే వైల్డ్ డాగ్… పోలిస్ ఇంటరాగేషన్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ లో ఉండగా కరోనా ఎఫెక్ట్ తో సినిమా నిరవధికంగా ఆగిపోగా మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమాకి కూడా…

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం మంచి ఆఫర్స్ వస్తున్నాయట. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా కూడా ఇలాంటి ఆఫర్స్ ప్రస్తుతం రావడం కష్టం అని అనిపించే విధంగా ఈ సినిమా కి 16 నుండి 18 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ ఆఫర్లు దక్కుతున్నాయని సమాచారం… మన్మథుడు2 సినిమా సీక్వెల్ అవ్వడం వలన 18 కోట్లకు పైగా బిజినెస్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఆ కమర్షియల్ మూవీ తో పోల్చుకుంటే ఈ ఎక్స్ పెరిమెంటల్ మూవీ కి 16 నుండి 18 కోట్ల రేంజ్ బిజినెస్ అంటే సాలిడ్ డీల్ అనే చెప్పాలి. కానీ నాగార్జున ఇంకా సినిమా పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, టీం తో కలిసి ఈ సినిమా పై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here