కింగ్ నాగార్జున కెరీర్ లో క్లాసిక్ అనిపించుకున్న సినిమాల్లో మన్మథుడు సినిమా ఒకటి, అలాంటి క్లాసిక్ సినిమా కి సీక్వెల్ గా వచ్చిన మన్మథుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆట కే సినిమా కి నెగటివ్ టాక్ రాగా అది సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వైరల్ గా మారి సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ఎఫెక్ట్ చూపి ఫైనల్ గా…
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి భారీ ఎదురుదెబ్బ కొట్టింది, సినిమా మొదటి రోజు టాక్ కి అతీతంగా కలెక్షన్స్ ని సాధించినప్పటికీ రెండో రోజు నుండే షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని సాధించినా ఎలాగోలా వీకెండ్ పూర్తీ చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో…
పూర్తిగా చేతులు ఎత్తేసింది ఈ సినిమా, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు చాలా త్వరగానే ముగిసింది అని చెప్పాలి. మన్మథుడు క్లాసిక్ అయితే ఇది వరస్ట్ సీక్వెల్ అంటూ ఫ్యాన్స్ కూడా సినిమా పై తమ ఫీలింగ్ ని షేర్ చేసుకున్నారు అంటే సినిమా ఎంతలా నిరాశ పరిచిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే…
Movie Business: 18.50Cr
Break Even: 19.50cr
AP TG Total Share: 8.95Cr
Total WW Share: 10.48cr
Total Gross: 18.07Cr
Total Loss: 8.02Cr Loss From Business
Movie Verdict: Double Disaster ఇదీ సినిమా టోటల్ కలెక్షన్స్ పరిస్థితి….
19.5 కోట్ల టార్గెట్ కి కేవలం 10.48 కోట్ల షేర్ ని మాత్రమె సాధించిన మన్మథుడు 2 సినిమా బిజినెస్ పరంగా 8.02 కోట్ల నష్టాన్ని మిగిలించి డబుల్ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుంది, ఇక ఇప్పుడు నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.