2019 టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ లిస్టు లో మొదటి సినిమా సాహో ఎట్టకేలకు అనేక అంచనాల నడుమ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 270.6 కోట్ల బిజినెస్ సాధించగా 272 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు కాగా అన్ని చోట్లా జోరు ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో…
అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో జరిగింది, 80% కి పైగా ఏరియాల్లో ఫస్ట్ డే టికెట్లు అస్సలు లేవు, ఆన్ లైన్ టికెట్ సేల్స్ అయితే టికెట్స్ పెట్టగానే అయిపొయింది, మొత్తం మీద బుకింగ్స్ ని బట్టి ఫస్ట్ డే అవలీలగా హైర్స్ యాడ్ అయితే 40 కోట్ల షేర్ పక్కా..
ఇక కర్ణాటక లో కూడా రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్ జరుగుతున్నాయి, దాంతో అన్ని భాషలు కలిపి ఫస్ట్ డే సినిమా అక్కడ 8 కోట్ల నుండి 10 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు, ఇక హిందీ లో బుకింగ్స్ స్లో గా మొదలు అయినా రోజులు ముగుస్తున్న కొద్ది జోరు పెరిగింది. దాంతో సినిమా టాక్ కూడా బాగుంటే…
అవలీలగా 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక తమిళ్ అండ్ మలయాళం లో అనుకున్న రేంజ్ బుకింగ్స్ అయితే జరగలేదు, కానీ రెండు చోట్లా కలిపి ఫస్ట్ డే 5 కోట్ల దాకా గ్రాస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇక ఓవర్సీస్ లో అమెరికా లో అన్ని భాషల బుకింగ్స్ జరుగుతున్నాయి కావునా…మినిమం 1.2 మిలియన్ దాకా ప్రీమియర్ షో కలెక్షన్స్ రావచ్చు.
మొత్తం మీద మొదటి రోజు గ్రాస్ అన్ని చోట్లా కలిపి మినిమం 100 కోట్లకు పైగానే ఉండే చాన్స్ ఉంది, ఇక టాక్ బాగుండి అన్ని చోట్లా దుమ్ము లేపితే లెక్క ఎక్కడి దాకా వెళుతుందో చెప్పలేం. ఓవరాల్ గా ఇండియన్ సినిమా హిస్టరీ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా సాహో నిలవడం ఖాయమని చెప్పొచ్చు.