కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కి మొదట్లో తెలుగు లో పెద్దగా క్రేజ్ లేదు, మిగిలిన తమిళ్ హీరోలకు ఇక్కడ మంచి సినిమాలు పడటం తో క్రేజ్ విషయం లో వాళ్ళు విజయ్ కన్నా ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండేవారు, కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. తన లేటెస్ట్ మూవీస్ విషయం లో చాలా శ్రద్ధ తీసుకుని సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ సినిమా సినిమా కి రికార్డులు సృష్టిస్తున్నాడు విజయ్.
ఇక అవే సినిమాలు తెలుగు లో కూడా డబ్ అవుతూ ఒక్కోటి మంచి కలెక్షన్స్ ని సాధిస్తుండగా ప్రస్తుతం విజయ్ కి తెలుగు లో ఒకప్పుడు క్రేజ్ ఉన్న హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ ఇప్పుడు దక్కింది. లాస్ట్ ఇయర్ సర్కార్ సినిమా బిలో యావరేజ్ టాక్ తోనే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అనిపించుకుంది.
ఇప్పుడు ఆ క్రేజ్ చూసే విజయ్ లేటెస్ట్ మూవీ బిజిల్ ని తెలుగు లో దీపావళి టైం లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెడుతున్నారు. PRO అండ్ నిర్మాత అయిన SMకోనేరు ప్రొడక్షన్ హౌస్ అయిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారట.
కాగా తెలుగు లో సినిమా బిజినెస్ ఇంత అని రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా తెలుగు బిజినెస్ 9 కోట్ల రేంజ్ లో పలికిందని అంటున్నారు. ఇది తెలుగు లో విజయ్ కెరీర్ లో బెస్ట్ బిజినెస్ రికార్డ్ అని చెప్పాలి. ఇది వరకు సర్కార్ సినిమా 7.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది.
తెలుగు లో ఈ సినిమా కనుక అంచనాలను అందుకుని భారీ విజయం సాధిస్తే విజయ్ క్రేజ్ తెలుగు లో డబుల్ ట్రిబుల్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సినిమా దీపావళి రేసులో తెలుగు సినిమా వెంకీమామ తో గట్టి పోటి ని ఎదురుకోబోతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.