నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతంగా హోల్డ్ చేసి సంచలనం సృష్టిస్తుంది, సినిమా కి మరీ అద్బుతమైన రివ్యూ లు అయితే రాలేదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో నాని కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ ఏంటో చూపుతూ సినిమా మొదటి రెండు రోజుల్లో 11.75 కోట్ల షేర్ ని అందుకోగా మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ జోరు సాలిడ్ గా కొనసాగుతుంది.
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు కన్నా 20% వరకు ఎక్కువ ఆన్ లైన్ టికెట్ సేల్స్ బుకింగ్స్ లో జోరు చూపింది, కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మాస్ సెంటర్స్ లో కొద్దిగా తగ్గాయి. అయినా కానీ క్లాస్ సెంటర్స్ అండ్ మల్టీ ప్లేక్సులలో జోరు రోజు మొత్తం కొనసాగింది.
దాంతో సినిమా రెండో రోజు అవలీలగా 3.5 కోట్ల రేంజ్ షేర్ ని, మల్టీప్లేసులలో జోరు బాగుండటం తో 3.7 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు అనుకున్న రేంజ్ కి మించి ఉంటె కనుకా మూడో రోజు 4 కోట్ల రేంజ్ కి షేర్ ని అందుకునే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3 వ రోజున 4.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఈ కలెక్షన్స్ తో సినిమా వీకెండ్ ని ఆల్ మోస్ట్ 16.5 కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ తో ముగించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఆ కలెక్షన్స్ తో సినిమా మొదటి వీకెండ్ లోనే…
బిజినెస్ లో సగానికి పైగా రికవరీ ని సొంతం చేసుకోబోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని బట్టి లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అన్నది చెప్పగలం, ఇక వీకెండ్ కి గాను అఫీషియల్ గా సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.