యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు, బాహుబలి సిరీస్ తర్వాత రెండేళ్ళ కి పైగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా పై నెలకొన్న క్రేజ్ ని సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ ఏమాత్రం సంభందం లేదని చెప్పూచ్చు. అనుకున్న అంచనాలను అందుకోలేక పోయిన సాహో మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
కానీ వీకెండ్ వరకు సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా తర్వాత హాలిడేస్ వచ్చినప్పుడు కొద్ది వరకు జోరు చూపి మిగిలిన రోజుల్లో పూర్తిగా స్లో డౌన్ అయ్యింది. ఓవరాల్ గా 20 రోజులను పూర్తీ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 217 కోట్ల లోపు…
షేర్ ని అన్ని భాషల్లో కలిపి అందుకుని సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్ర లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీ లో కూడా అంత నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ సినిమా టాక్ ని కూడా పట్టించుకోకుండా…
సినిమా ను హిందీ వర్షన్ వరకు సూపర్ హిట్ ని చేశారు. తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా కూడా 110 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. ఇవన్నీ తొలిరోజు వచ్చిన డిసాస్టర్ టాక్ తోనే సొంతం చేసుకుంది సాహో సినిమా. అదే సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటె.. ఈ పాటికే మరిన్ని…
అద్బుతమైన రికార్డులను నమోదు చేసి ఉండేది. టాలీవుడ్ చరిత్రలో కొత్త రికార్డులు నమోదు చేసి ఉండేది. హిందీ లో టాప్ స్టార్ ల కెరీర్ బెస్ట్ లను సవాల్ చేసి ఉండేది. ఓ అద్బుతమైన అవకాశాన్ని మిస్ చేసుకుంది సాహో సినిమా.. కానీ ప్రభాస్ కి హిందీ లో ఓ బాలీవుడ్ స్టార్ హీరోకి ఉన్నంత పాపులారిటీ ఉందని నిరూపించింది సాహో సినిమా…