Home గాసిప్స్ అక్కడ నుండి షాకింగ్ రెస్పాన్స్…రచ్చ తప్పదేమో!

అక్కడ నుండి షాకింగ్ రెస్పాన్స్…రచ్చ తప్పదేమో!

0

     టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే సినిమా ట్రైలర్ కి వచ్చిన టాక్ సినిమా కి కూడా వస్తే బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్ము దుమారం చేసే రేంజ్ లో… ఇక సినిమా ట్రైలర్ కి తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

మిగిలిన సౌత్ భాషల కన్నా అందరు ఆశించే హిందీ మార్కెట్ లో సినిమా కి ఎలాంటి క్రేజ్ దక్కుతుందా అని ఎదురు చూడగా అక్కడ నుండి రెస్పాన్స్ కూడా యునానిమస్ పాజిటివ్ గా ఉండటం విశేషం, సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇది వరకు రిలీజ్ అయిన పెద్ద సినిమా…

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తో పోల్చుతూ ఆ సినిమా లో విజువల్స్ కానీ, గ్రాండియర్ కానీ నాసిరకంగా ఉన్నాయని, కానీ సైరా లో అన్నీ అద్బుతంగా సెట్ అవ్వడమే కాకుండా ట్రైలర్ లో చాలా సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి అంటూ ట్రైలర్ పై వాళ్ళ స్పందనని తెలియ జేస్తున్నారు.

దాంతో ఇప్పుడు హిందీ లో సినిమా కి థియేటర్స్ కౌంట్ క్రమంగా పెరగ నుండగా అక్టోబర్ 2 న అక్కడ సైరా కి పోటిగా రిలీజ్ కానున్న వార్ సినిమా కన్నా బెటర్ ట్రైలర్ రెస్పాన్స్ ని ఇప్పుడు సైరా సొంతం చేసుకోవడం తో రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ రచ్చ తప్పదని అంతా భావిస్తున్నారు.

సైరా కి టాక్ బాగుంటే ఓపెనింగ్స్ మరీ అద్బుతంగా ఉండక పోయినా లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంటుందని, వార్ లో యాక్షన్ సీన్స్ ఉన్నా, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ సైరా లో అలా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉండటం తో ఈ సినిమా ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కానుందని అంతా భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here