టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలు పూర్తీ చేసుకుని మూడో వారం లో ఎంటర్ అయింది, దసరా సెలవుల క్రేజ్ తో సినిమా మంచి వసూళ్ళ ని సాధించినా మిగిలిన చోట్ల అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం లో విఫలం అయిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాల పైనే ఎక్కువగా డిపెండ్ అయ్యింది. అయినా కానీ..
మెగాస్టార్ క్రేజ్ పవర్ తో టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ తప్పితే మరే సినిమా సొంతం చేసుకోలేని విధంగా 100 కోట్లకు పైగా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని సత్తా చాటుకుంది సైరా నరసింహా రెడ్డి సినిమా. కానీ సెలవులు అయిపోవడం వర్కింగ్ డేస్ మొదలు అవ్వడంతో…
అందుకోవాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉండటం తో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో కష్టాలు పడాల్సి వస్తుంది. సినిమా ను రెండు తెలుగు రాష్ట్రాలలో 106.8 కోట్లకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 107.5 కోట్ల దాకా షేర్ ని సినిమా రెండు రాష్ట్రాలలో అందుకోవాల్సి ఉంటుంది. కానీ 17 రోజులు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో…
సైరా నరసింహా రెడ్డి 104.38 కోట్ల షేర్ తో ఉంది. అంటే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 3.12 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది కష్టంగా ఉన్నా బిజినెస్ ని దాటాలి అన్నా కూడా మరో 2.42 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కొత్త సినిమాల రిలీజ్ ల వలన సైరా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కౌంట్…
దాదాపు గా ఇప్పుడు 280 రేంజ్ లో ఉంది, ఈ రోజు రేపు వీకెండ్ హాలిడేస్ అవ్వడం తో ఈ రెండు రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ చాలా కీలకం అని చెప్పాలి. 17 వ రోజు 29 లక్షలు సాధించిన సినిమా ఈ రెండు రోజుల్లో భారీ గ్రోత్ ని సాధిస్తేనే రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవుతుంది, మరి ఏం జరుగుతుందో చూడాలి.