Home న్యూస్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఫస్ట్ డే కలెక్షన్స్…దారుణం ఇది!!

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఫస్ట్ డే కలెక్షన్స్…దారుణం ఇది!!

0

     కెరీర్ స్టార్టింగ్ లో మంచి సక్సెస్ లు వచ్చినా తర్వాత ఎంచుకునే స్రిప్ట్ లు సరిగ్గా ఎంచుకోక పొతే జరిగే నష్టాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే, ఎంతో మంది హీరోలు కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు కొట్టినా తర్వాత వేసే ఒకటి రెండు రాంగ్ స్టెప్స్ కే కెరీర్ క్లోజ్ అయి ఖాళీ గా ఉన్నారు. కొందరు మాత్రం ఇతర పాత్రలు చేస్తూ ఎంతో కొంత లైం లైట్ లో ఉన్నారు.

టాలీవుడ్ లో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు చేసిన నటుడు సాయి కుమార్ ఇంకా బిజీగానే ఉండగా ఆయన కుమారుడు ఆది కెరీర్ ని అద్బుతంగా ఆరంభించాడు. ప్రేమ కావాలి, లవ్ లీ లాంటి సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ కొట్టి…

తనకున్న రేంజ్ లో ఆ టైం లోనే 10 కోట్ల రేంజ్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత మాస్ భాట పట్టాలని అని ట్రై ఒకటికి మించిన ఫ్లాప్స్ పడగా తిరిగి లవ్ స్టొరీ లు చేయాలి అని ట్రై చేసినా అవి కూడా వర్కౌట్ అవ్వక ఇప్పుడు గడ్డు పరిస్థితిలో ఉన్నాడు.

ఈ ఇయర్ ఇప్పటికే బుర్రకథ, జోడి అంటూ 2 సార్లు వచ్చి వీకెండ్ కూడా ఉండకుండా థియేటర్స్ నుండి వెళ్ళిపోగా రీసెంట్ గా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటూ కొత్త సినిమాతో రాగా ఆ సినిమా మార్నింగ్ షో కే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం… 21 లక్షల షేర్ ని రెండు రాష్ట్రాలలో…

వరల్డ్ వైడ్ గా 28 లక్షల షేర్ ని అందుకుని డిసాస్టరస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. సినిమా హిట్ అవ్వాలి అంటే 4 కోట్ల దాకా షేర్ అందుకోవాలి. ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ ని అందుకున్నాకా ఆ రేంజ్ లో రికవరీ ని సొంతం చేసుకోవడం అసాధ్యం అనే చెప్పాలి. దాంతో ఆది కి మరో నిరాశ కన్ఫాం అయినట్లే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here