మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ని తెలుగు వర్షన్ వరకు తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవుల అడ్వాంటేజ్ తో దుమ్ము లేపే రేంజ్ లో నాన్ స్టాప్ గా అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 9వరకు ఎంజాయ్ చేయగా తర్వాత సెకెండ్ వీకెండ్ కూడా సాలిడ్ గా నే హోల్డ్ చేసింది. కానీ ఇంతా చేస్తే సినిమా 18 రోజులు పూర్తీ అయ్యే సరికి…
ఒక్క వర్షన్ కూడా ఇంకా సేఫ్ కాలేదు… హిందీ లో వార్ వల్ల దెబ్బ పడగా కన్నడ లో పర్వాలేదు అనిపించిగా ఓవర్సీస్ లో కూడా అంతంతమాత్రమే కలెక్షన్స్ ని అందుకుంది, ఇక తమిళ్ మరియు కేరళలో సినిమా ప్రదర్శన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
ఇవన్నీ కాకుండా తెలుగు వర్షన్ గురించి మాట్లాడుకుంటే సినిమా కి మెగాస్టార్ చివరి మూవీ లా లాంగ్ రన్ దక్కడం లేదు.. వర్కింగ్ డేస్ లో సైరా ఏమాత్రం హోల్డ్ చేయలేక పోతుంది. దాంతో టార్గెట్ ని అందుకోవడం కష్టం అవుతుంది. పోటి లో సినిమాలు చేతులు ఎత్తేసినా ఏకంగా యునానిమస్ అనిపించే రేంజ్ లో 3.5 యావరేజ్ రేటింగ్ తో ఓపెన్ అయినా కానీ…
మెగాస్టార్ మూవీ కి లాంగ్ రన్ లేకపోవడం ఒకింత షాక్ ని కలిగించే విషయమే… దానికి ప్రధాన కారణం సినిమా జానర్ అని చెప్పొచ్చు. దేశభక్తి నేపధ్యంలో సినిమాలు హిట్ అవ్వడం చాలా తక్కువ… అందునా రిపీట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, అదే కమర్షియల్ మూవీ అయితే ఈ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు.
టాక్ పర్వాలేదు అనిపించినా ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్స్ వేస్తారు, కానీ సైరా విషయం లో అది జరగడం లేదు. చిరు పడ్డ కష్టం కోసం ఆడియన్స్ ఒకసారి చూస్తున్నా రిపీట్ ఆడియన్స్ మాత్రం సినిమా కి దక్కక పోవడమె ఈ వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ కి కారణం అని చెప్పొచ్చు.
అందునా సినిమాలో యాంటీ క్లైమాక్స్ ఉండటం, సాడ్ క్లైమాక్స్ టాలీవుడ్ ఆడియన్స్ పెద్దగా ఇష్టపడరు అన్నది అందరికీ తెలిసిందే కాబట్టి అది కూడా ఇంపాక్ట్ చూపి ఉండొచ్చు. ఇక రీసెంట్ టైం దసరా బరిలో నిలిచిన సినిమాలు అన్నింటికీ గత రెండు మూడు ఏళ్ళుగా ఇదే పరిస్థితి ఎదురు అవుతుంది.
2016 లో వచ్చిన దసరా మూవీస్ లో ప్రేమం హిట్ టాక్ తెచ్చుకున్నా దసరా వీకెండ్ తర్వాత స్లో డౌన్ అయింది, 2017 లో జైలవకుశ స్పైడర్ పై గెలిచినా లాంగ్ రన్ పెద్దగా లేదు, ఇక లాస్ట్ ఇయర్ కూడా అరవింద సమేత పండగ వరకు 11 రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ సాధించి తర్వాత స్లో డౌన్ అయింది.
రామ్ హలో గురి ప్రేమ కోసమే కూడా మంచి టాక్ నే తెచ్చుకున్నా లాంగ్ రన్ ఏమి లేదు ఆ సినిమా కి… దాంతో మిగిలిన సీజన్స్ తో పోల్చితే దసరా సీజన్ లో కలెక్షన్స్ వస్తున్నా రీసెంట్ టైం లో లాంగ్ రన్ ఉండటం లేదు.. కానీ బాహుబలి తర్వాత ఆ రేంజ్ బడ్జెట్ తో
మెగాస్టార్ అల్టిమేట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఊపులో 3.5 యావరేజ్ రేటింగ్ తో ఎలాంటి పోటి లేకుండా రెండు రాష్ట్రాలలో కూడా సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టం అయింది అంటే… మిస్టేక్ ఎక్కడ జరిగి ఉండొచ్చు అంటూ విశ్లేషకులు తలలు పెట్టుకు ఆలోచిస్తున్నారు.
ఓవర్సీస్ లో అదే రేటింగ్ తో మహానటి లాంటి సినిమాలు అద్బుతాలు సృష్టించిన చోట సైరా నిరాశ పరిచింది. మొత్తం మీద సినిమా లో కలెక్షన్స్ కి రీజన్స్ ఏవైనా కానీ…. బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా సినిమా బడ్జెట్ కి, బిజినెస్ కి, రేటింగ్ కి తగ్గ కలెక్షన్స్ ని అందుకోవడం లేదనే చెప్పాలి.