Home గాసిప్స్ ఇంకా రిలీజ్ కూడా కాలేదు…అప్పుడే 150 కోట్ల ప్రాఫిట్!!

ఇంకా రిలీజ్ కూడా కాలేదు…అప్పుడే 150 కోట్ల ప్రాఫిట్!!

0

     అభిమానులు ఎప్పటి కప్పుడు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకుని అలాంటి సినిమాలతో వాళ్లకి విందు భోజనం పెట్టె హీరోల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముందు ఉంటాడు అని చెప్పొచ్చు. 10 ఏళ్ల క్రితం వాంటెడ్ సినిమా తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చిన సల్మాన్ అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని సార్లు మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాడు, కానీ అతని మార్కెట్ వాల్యూ మాత్రం హిట్స్ కి ఫ్లాఫ్స్ కి ఏమాత్రం తేడా లేకుండా పెరుగుతూనే ఉంది.

ఈ ఇయర్ భరత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకున్నాడు, ఇక ఇప్పుడు తన కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ అయిన దబాంగ్ సిరీస్ లో భాగంగా మూడో సినిమా ను ఇయర్ ఎండ్ లో రిలీజ్ చేస్తున్నాడు.

దబాంగ్ 3 కి అల్టిమేట్ బజ్ ఏర్పడగా రిలీజ్ కి ఇంకా సమయం ఉండగా ఓవరాల్ గా 150 కోట్ల ప్రాఫిట్ తో ఉన్నాడట సల్మాన్. ఈ సినిమాకి నిర్మాత సల్మాన్ కాగా సినిమాను ఓవరాల్ గా 80 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారట. ఇక పబ్లిసిటీ అండ్ ప్రింట్స్ ఖర్చు లతో కలిపి 105 కోట్లు అయిందట ఈ సినిమా కి.

కాగా బిజినెస్ మొదలు కాక ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ లో శాటిలైట్ రైట్స్ 80 కోట్లు పలకగా స్ట్రీమింగ్ రైట్స్ 60 కోట్లు పలికిందట. ఇక మ్యూజిక్ రైట్స్ కింద 15 కోట్లు దక్కగా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రెవెన్యు 155 కోట్లు రాగా ఇప్పటికే 50 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా ఇండియా లో బిజినెస్ కింద 100 కోట్ల దాకా బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే రిలీజ్ కి ముందే సినిమాకి ఏకంగా 150 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, ఇక సినిమా ను కొన్న వాళ్లకి ప్రాఫిట్స్ రావాలి అంటే సినిమా 200 కోట్లు మినిమం మంచి లాభాలు రావాలి అంటే 250 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here