నటసింహం నందమూరి బాలకృష్ణ 2019 ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు మూడో సారి రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ ఇయర్ మొదట్లో రెండు సార్లు ప్రేక్షకుల ముందుకు రాగా 2 సార్లు ప్రేక్షకులను నిరాశ పరిచాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లోని 2 పార్టులు కూడా ప్రేక్షకులను అలరించలేక పోయాయి. ఇలాంటి సమయం లో తనకి జై సింహా తో హిట్ ఇచ్చిన కే. ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో రూలర్ సినిమా ను కంప్లీట్ చేస్తున్నాడు బాలయ్య.
షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 20 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా రిలీజ్ ఇంకా సమయం ఉండగా సినిమా బిజినెస్ జోరు అందుకోగా ముందుగా సీడెడ్ ఏరియా బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది.
ముందుగా 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది అన్న వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు అది పూర్తిగా కన్ఫాం కాదని తేలగా ఓవరాల్ గా బిజినెస్ 5.5 కోట్ల రేంజ్ లో జరిగినట్లు సమాచారం. కాగా కొన్ని సెంటర్స్ లో సినిమా ను నిర్మాతలు ఓన్ గా రిలీజ్ చేయబోతున్నారట. దాంతో బిజినెస్ కొంచం తగ్గిందని అంటున్నారు.
సీడెడ్ లో బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగా లెజెండ్ 8 కోట్లకి పైగా షేర్ తో ఇప్పటికీ టాప్ లో ఉంది. ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్ మెండుగా ఉండేలా చూసుకుని పవర్ ఫుల్ పోలిస్ రోల్ లో అలాగే అల్ట్రా స్టైలిష్ లుక్ లో బాలయ్య గెటప్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.
దాంతో ఈ సినిమా తో ఇయర్ మొదట్లో ఫ్లాఫ్ అయిన 2 సినిమాలను మరిపించే హిట్ కొట్టాలని బాలయ్య చూస్తున్నాడు. డిసెంబర్ 20 న పోటి లో సాయి ధరం తేజ్ ప్రతీ రోజు పండగే కూడా రిలీజ్ కానుంది. మరి పోటి లో ఎవరు గెలుస్తారో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటారో చూడాలి. ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ లెక్కలు త్వరలో తెలనున్నాయి.